హ్యాట్రిక్ విజయంతో అచ్చంపేట గడ్డన గులాబీ జెండా ఎగరవేస్తాం
హ్యాట్రిక్ విజయంతో అచ్చంపేట గడ్డన గులాబీ జెండా ఎగరవేస్తాం
• అచ్చంపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..
• పదర మండల కేంద్రంలో భారీ రోడ్ షో, ర్యాలీ
• అశేష జనవాహిని మధ్య బాలరాజన్న ప్రసంగం
పదర: హ్యాట్రిక్ విజయంతో అచ్చంపేట గడ్డన గులాబీ జెండా ఎగరవేస్తామని అచ్చంపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పదర మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి రోడ్ షో, భారీ నిర్వహించిన అనంతరం ప్రసంగించారు.
🎤 సమావేశం ప్రధాన అంశాలు..
• హ్యాట్రిక్ ఓటమితో ఓడిపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడిది
🔥 హ్యాట్రిక్ విజయంతో గెలవబోతున్న చరిత్ర ప్రజల పార్టీ అయిన బిఆర్ఎస్ పార్టీది
🔹 స్థానికుడిని అని చెప్పుకుంటున్న వంశీకృష్ణ స్థానికులకు మాత్రం సేవ చేయకుండ ఇతర ప్రాంతాలల్లో వైద్య వ్యాపారం చేస్తాడని విమర్శించారు.
🔸 వారి కుటుంబంలో ఇద్దరు డాక్టర్లు ఉన్న ఈ ప్రాంత పేద ప్రజల కోసం ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా నిర్మించ లేదు, వ్యాపారం చేసుకోవడానికి మాత్రం కార్పోరేట్ స్థాయి ఆసుపత్రులు నిర్మించుకున్నారని, పేద ప్రజల బాధలు తెలియని నాయకుడిని రాజకీయంగా పాతరేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
🔹 కాంగ్రెస్ పార్టీకి ఐదు సంవత్సరాలు గుర్తురాని ప్రజలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే గుర్తువస్తారని మండిపడ్డారు.
🔸 రైతులకు రైతుబంధు ఇవ్వకుండా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమీషన్ కి పిర్యాదు చేయడంతో రైతుబంధు పంపిణీ నిలిపి వేశారని, రైతుల వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని కానరాకుండా చేద్దామన్నారు.
✊ అందరి సహకారంతో మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి హ్యాట్రిక్ విజయంతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారిని, అచ్చంపేటలో తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.
💥 ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాంబాబు నాయక్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్ర నరసింహ, వైస్ ఎంపీపీ వరుణ్ కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీను, మండల ఉపాధ్యక్షుడు దాసరి ఎల్లయ్య, ఎంపీటీసీలు శ్రీమతి సునీత శ్రీను, శ్రీమతి ఎల్లమ్మ శ్రీను, పదర గ్రామ అధ్యక్షుడు బీనమోని నారయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాలు, సింగిల్ విండో డైరెక్టర్ రమేష్, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ విష్ణుమూర్తి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.