బిఆర్ఎస్ పార్టీ నాయకులపై రోజురోజుకీ పెరిగిపోతున్న కాంగ్రెస్ ఆగడాలు…
బిఆర్ఎస్ పార్టీ నాయకులపై రోజురోజుకీ పెరిగిపోతున్న కాంగ్రెస్ ఆగడాలు
– జిబిఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి గువ్వల అమల గారు..
• ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ కుటుంబానికి పరామర్శ
అచ్చంపేట: బిఆర్ఎస్ పార్టీ నాయకులపై రోజురోజుకీ కాంగ్రెస్ ఆగడాలు పెరిగిపోతున్నాయని జిబిఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీమతి గువ్వల అమల గారు అన్నారు. బల్మూర్ మండలం మంగళకుంట పల్లి గ్రామంలో బుధవారం జరిగిన బిఆర్ఎస్ ప్రచారం విజయవంతం కాగా అది జీర్నించుకోలేని కాంగ్రెస్ పార్టీ రౌడీలు సర్పంచ్ రొడ్డ ప్రియాంక గణేష్ పై చేయి చేసుకోవడమే గాక వారి తల్లి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వారు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలుసుకొని అర్థరాత్రి అక్కడికి చేరుకుని పరామర్శించారు.
🔹 అచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ ఒడిపోతున్నామని తెలిసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు ప్రేరేపిస్తున్నారని విమర్శించారు.
🔸 ఇలాంటి దాడులు చేయడం మంచి సంస్కృతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గొడవలకు పునాది అని ఎద్దేవా చేశారు.
🔹 వారికి మంచి వైద్యాన్ని అందించాలని డాక్టర్లను కోరారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin