Congress Prabhutva Hamilu Neraverchali
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
– నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షులు & అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు.. Congress Prabhutva Hamilu Neraverchali
రైతులకు మద్దతుగా అచ్చంపేట పట్టణంలో రైతుదీక్ష
అచ్చంపేట: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలనీ నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ అధ్యక్షులు & అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా నేడు పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద పార్టీ శ్రేణులతో కలిపి దీక్ష నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరిధ్యానం పంటకు రూ. 500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ.12000, ఎండిన పంటకు ఎకరాకు రూ.25000 వెంటనే చెల్లించి., మరియు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతులకు న్యాయం చేయాలని కోరారు. Congress Prabhutva Hamilu Neraverchali
ప్రాజెక్టులలో నీళ్లు ఉన్న రైతుల పంటలకు నీళ్లు ఇవ్వకుండా రైతులకు ద్రోహం చేస్తున్నారని, పంటలు ఎండిపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, చనిపోయిన రైతులకు నష్ట పరిహారం తో పాటు, వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin