Maji Mla Guvvala Balaraju | ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి Maji Mla Guvvala Balaraju
– అచ్చంపేట మాజి శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు..
– రైతులకు సంక్షేమ పాలన అందిస్తారని మా పార్టీ భావిస్తోంది
– అచ్చంపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు నేను అండగా ఉంటా
– గెలిచిన, ఓడిన నేను ఎప్పుడూ ప్రజల మధ్యనే
అచ్చంపేట: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని అచ్చంపేట మాజి శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు అన్నారు. సోమవారం పట్టణంలోని టీచర్స్ కాలనీ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. Maji Mla Guvvala Balaraju
>కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజలకు అందిస్తామన్న సంక్షేమ పాలన అందించాలన్నారు.
> కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
> అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహ గౌడ్, ఎంపీపీ శ్రీమతి శాంతభాయి లోక్యనాయక్, మాజి మున్సిపల్ చైర్మన్ తులసీరాం నాయక్, పదర జెడ్పీటీసీ రాంబాబు నాయక్, కౌన్సిలర్లు మను పటేల్, అంతటి శివ, తగురం శ్రీను, సోమ్ల నాయక్, నాయకులు అమీనోద్దీన్, చెన్నకేశవులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin