Sankshema Palana Andinchali | ప్రజలకు సంక్షేమమైన పాలన అందించాలి
ప్రజలకు సంక్షేమమైన పాలన అందించాలి.
– బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు.
– వంగూరు మండల కేంద్రంలో మీడియా సమావేశం Prajalaku sankshema palana andinchali
వంగూరు: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమమైన పాలన అందించాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
🔹 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినా ఐదు రోజుల్లోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చి 21రోజులు అవుతున్న నేటికీ రుణమాఫీ చేయకపోవడం రైతులను మోసం చేయడమేనని పేర్కొన్నారు.
🔸 కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తామని చెప్పిన ఆరోగ్యారెంటీలను వెంటనే ప్రజలకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పథకాలు ప్రతి ఒక్కరికి లబ్ది చేరే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు.
🔹 కెసిఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని, రాష్ట్రాన్ని సంక్షేమ రంగంలో అగ్రస్థానంలో నిలిపామన్నారు. ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుల కళ్ళల్లో ఆనందం చూసామన్నారు. Prajalaku sankshema palana andinchali
🔸 బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో అచ్చంపేట ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని వివరించారు.
💠 ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అంకూరీ అంజి, నాయకులు గణేష్ రావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin