అదే హోరు – కారు జోరు
అదే హోరు – కారు జోరు
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం లింగాల మండల పరిధిలోని కోమటికుంట, దత్తారం, జీలుగుపల్లి, జీలుగుపల్లి తండా, శాయిన్ పేట, KC తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..
ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు వెళ్లి మన ప్రభుత్వమే మంచి చేస్తుంది మల్లి మన ప్రభుత్వాన్నే ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
🔸 కాంగ్రెస్ పార్టీ అంటేనే రౌడీ యిజనికి కేరాఫ్ అడ్రస్ గా ఆ పార్టీ అని విమర్శించారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని తన నివాసానికి వస్తుండగా కాంగ్రెస్ రౌడీ మూకలు నాపై దాడిచేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
🔥 తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వమే మంత్రి చేస్తుందని మరోసారి ఆశీర్వదించాలని పేర్కొన్నారు.
💠 ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మాకం తిరుపతయ్య, కేటి తిరుపతయ్య, జయంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సుధీర్ గౌడ్, PACS ఛైర్మెన్ ఆనంద్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రవిశంకర్, సర్పంచులు జంగమ్మ, బచ్చన్న, లక్ష్మణ్ నాయక్, మల్లేష్, స్థానిక నాయకులు, ప్రజాపతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.