అచ్చంపేట సువిశాలమైన మరియు సుందరమైన ప్రజా జీవనం కలిగిన ప్రాంతం విభిన్న కులాలు, విభిన్న మతాలు, జాతులు కలిగి కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న ప్రాంతం చుట్టూ నల్లమల కొండలు అటవీ సంపద కలిగిన ప్రదేశం.
అచ్చంపేట ప్రధాన వృత్తి వ్యవసాయం ఈ ప్రాంతంలో ఎక్కువగా వర్ష ఆధారిత పంటలను సాగుచేస్తారు అందులో మొదటిది పత్తిపంట, మొక్కజొన్న, వేరుశెనగ, జొన్న, మొదలగు మెట్టపంటలను పండిస్తుంటారు అక్కడక్కడా వరి సాగు కనిపిస్తుంటుంది.
అచ్చంపేట నియోజక వర్గం లో ఆరు మండలాలు కలిగి ఉన్నాయ్ 1. ఉప్పునుంతల, ౨. లింగాల, ౩. బల్మోర్, 4. అమ్రాబాద్, 5. వంగూరు, 6. అచ్చంపేట. అచ్చంపేట లో ప్రతి ఆదివారం రోజు (సంత) మార్కెట్ సాగుతుంది, ఈ రోజు చుట్టూ పక్కల అన్ని మండలాలనుండి మరియు గ్రామాలనుండి ప్రజలు తమకు కావలసిన సరుకులను నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకొని పోతుంటారు. మరియు ప్రతి మంగవరం రోజు వ్యాపారాలకు సెలవుదినంగా వ్యవహరిస్తారు.
పాతబజార్:
పాతబజార్ ఇది బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి ఇక్కడ 20 నుండి 40 బంగారు షాపులు ఉంటాయి, వివిధ రకాల ఆభరణాలను ఇక్కడ తయారు చేయడం కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనికి తోడుగా ఈ రోడ్డు వెంబడి ఆరెంపీ హాస్పిటల్స్ మరియు మెడికల్ దుకాణాలు కూడా ఉంటాయి.
పాతబస్టాండ్ ఓమ్ చేవ్రాస్తా:
ఇది పాతబస్టాండ్ మరియు ఓమ్ చేవ్రాస్తా గ పిలవబడుతుంది ఇక్కడ వివిధ గ్రామాలకు వెళ్లే ప్రజలు బస్సు సౌకర్యం కోసం వేచివుంటారు. ఈ చేవ్రాస్తా లో పండ్ల షాపులు ఎక్కువగా ఉంటాయి, అదేవిదంగా ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంటుంది ఈ బస్టాండ్ చుట్టూ కిరానా షాపులు, బట్టల షాపులు, వైన్ షాపులు కూడా ఉంటాయి. ఇది అచంపేట కు ఒక ప్రధాన కూడలిగా చెప్పవచ్చు.
కూరగాయల మార్కెట్ రోడ్
కూరగాయల మార్కెట్ ఇక్కడ అన్నిరకాల కూరగాయలు మరియు నిత్యవసర వస్తువులు లభ్యమవుతాయి ఇక్కడ రైతులు తము పండించిన వివిధ రకాల కూరగాయలను నేరుగా విక్రయిస్తుంటారు, అదేవిదంగా ఈ మార్కెట్ లో అన్నిరకాల నిత్యావసర వస్తువులు లభ్యమవుతాయి అదేవిదంగా ఇక్కడ కిరానా షాపులు, చికెన్ షాపులు, స్టిల్ షాపులు, మంగలి షాపులు, గాజుల షాపులు కలిగి వున్నాయి. ఈ రోడ్డులో ప్రతి మంగళ వరం ఒక్క కిరణం షాపు మాత్రమే తెరవబడుతుంది.
అచంపేట హిస్ట్రోరి మరియు బయోగ్రఫీ.
Achampet History అనేక సంవత్సరాలు ఈ ప్రాంతన్ని పోకల మరియు (పెరికె జమీందార్లు ), పురుగిరి క్షత్రియలు చాల సంవత్సరాలు పరిపాలించారు. వారు దేవదారికుంట, లింగోటం, తెల్కపల్లి, చేపూర్, మొదలైన గ్రామాలను మరియూ అచ్చంపేట చుట్టుప్రక్కల గ్రామాలను పరిపాలించారు. (Achampet Biography) తరువాత హైదరాబాద్ నిజాం పరిపాలించాడు, స్వాతంత్య్రం వచ్చినతరువాత ఈ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగా గుర్తించారు ఆ తరువాత 2005 నుండి ఈ ప్రాంతన్ని అభివృద్ధి చేసారు. (Achampet History and Information)
కొల్లాపూర్ గ్రామములోని అచ్చమాంబ అనే మహిళా గతంలో ఇక్కడ నివసించేది, ఇక్కడ జరిగిన గిరిజన యుద్ధంలో మాలిక్ కాఫుర్ జనరల్ ఆఫ్ ఔరంగజేబు (ఢిల్లీ సుల్తాన్ ) కు వ్యతిరేకంగా పోరాడారు ఆ సమయంలో ఈ గ్రామానికి అచ్చమ్మగడ్డ గా పేరు పెట్టారు. ఆ తరువాత ప్రజలు కొంతకాలానికి అచ్చమ్మపేట గా పిలుస్తూ వచ్చారు ప్రస్తుతానికి అచ్చంపేట గా పిలువా బడుతుంది. ఈ ప్రాంతం నుండి శ్రీశైలం 96 .6 కి. మీ. దూరంలో ఉన్నది మరియు ఉమామహేశ్వరం 13 .7 కి. మీ . దూరంలో ఉన్నది. ఉమామహేశ్వరం ఒక అందమైన నీటి జలపాతాలు గల కొండా ప్రాంతం మరియు పర్యాటక ప్రాంతం. ఇటీవల అచ్చంపేట నాగర్ కర్నూల్ జిల్లా యెక్క రెవిన్యూ డివిజన్ గా అభివృద్ధి చెందింది.
Achampet PIN code : | 509375 |
Telephone Code | 08541 |
ISO 3166 code | IN-TG |
Vehicle registration | TS |
Nearest Airport | Hyderabad |
Lok Sabha Constituency | Nagarkurnool |
Vidhan Sabha constituency | Achampeta |
అచ్చంపేట మండలమునకు ఈశాన్యమున దిండినది, నల్గొండ జిల్లా, దక్షిణమున అమ్రాబాదు మండలము , నైరుతివైపున బల్మూరు మండలం, వాయువ్యాన ఉప్పునుంతల మండలము సరిహద్దులుగా ఉన్నాయి.
అచ్చంపేట జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 57313. ఇందులో పురుషులు 29411, మహిళలు 27902. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 68888. ఇందులో పురుషులు 35550, మహిళలు 33338. పట్టణ జనాభా 28384, గ్రామీణ జనాభా 40504. జనాభాలో ఇది జిల్లాలో 14వ స్థానంలో ఉంది.
అచ్చంపేట నుండి రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు నుంచి మరియు మహబూబ్ నగర్ నుండి శ్రీశైలం వెళ్ళు ప్రధాన రహదారి మండలం గుండా అచ్చంపేట, రంగాపూర్ మీదుగా వెళుతుంది. అచ్చంపేటలో ఆర్టీసీ బస్సుడిపో కూడా ఉంది.
అచ్చంపేట రాజకీయాల వివరాలు:
ఈ మండలము అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గము, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గములో భాగము. జిలాపరిషత్తు వైస్-చైర్మెన్‌గా పనిచేసిన మర్యాద గోపాలరెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన పోకల మనోహర్ ఎన్నికయ్యారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో మండలంలో మొత్తం 12 ఎంపీటీసి స్థానాలకుగాను తెలుగుదేశం పార్టీ 6, కాంగ్రెస్ పార్టీ 4, తెరాస 2 స్థానాలలో విజయం సాధించాయి. ఎంపిపి పదవి తెలుగుదేశం పార్టీకి చెందిన పర్వతాలుకు లభించింది.
అచ్చంపేట మండల విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 67 ప్రాథమిక పాఠశాలలు (10 ప్రభుత్వ, 41 మండల పరిషత్తు, 16 ప్రైవేట్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 14 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 22 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 5 జడ్పీ, 15 ప్రైవేట్), 4 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 2 ప్రైవేట్) ఉన్నవి.
అచ్చంపేట వ్యవసాయం:
మండలం మొత్తం విస్తీర్ణం 60697 హెక్టార్లలో 10% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. 55% భూమి అటవీ ప్రాంతము. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న, ప్రత్తి. వరి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 709 మిమీ. మండలంలో సుమారు 1500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
మండలంలోని గ్రామాలు:
లింగోటం (Lingotam), తంగాపుర్ (Tangapur), నాదింపల్లి (Nadimpalli), అచ్చంపేట (Achampet), చౌటపల్లి (Choutapalli), గుంపంపల్లి (Gumpampalli), లక్ష్మాపుర్ (Lakshmapur) (P.N), పాకులపల్లి (Palukapalli), బొల్‌గాట్‌పల్లి (Bolghatpalli), బ్రాహ్మణపల్లి (Brahmanapalli), పులిజాల (Puljala), హాజీపూర్ (Hajipur), రంగాపూర్ (Rangapur), చందాపూర్ (Chandapur), చెన్నారం (Chennaram) (Sabak), సింగవరం (Singavaram), ఐనోల్ (Ainole), బొమ్మెనపల్లి (Bommenapalli), సిద్ధాపూర్ (Siddapur), మన్నెవారిపల్లి (Mannavaripalli), ఘన్‌పూర్ (Ghanapur), అక్కవరం (Akkavaram)
As per wikipedia we are publishing the information.