• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143
Share Button

నల్లమల్ల లో గంజాయి కలకలం Nallamala lo ganjai kalakalam

– చిత్తవుతున్న యువకుల జీవితాలు

– గుప్పుమంటున్న గంజాయి మత్తు

– యువతే టార్గెట్ గా వ్యాపారం

– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన

– దేహశుద్ది చేసిన ప్రాంత ప్రజలు

Nallamala lo ganjai kalakalam నాగర్ కర్నూల్ జిల్లా, అమ్రాబాద్ మండల్ నల్లమల్ల అడవి ప్రాంతం సమీపంలోని తుర్కపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కొందరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో గ్రామస్తులు వారిని తనిఖీ చేసారు. Nallamala lo ganjai kalakalam వారి దగ్గర దాదాపు 1/2 కేజీ గంజాయి ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వారిని చితకబాది వారి నుండి రెండు సెల్ ఫోన్లు ఒక బైకు స్వాధీనం చేసుకు నీ పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది దీనిపై పోలీసు అధికారులను వివరణ కోరగా దర్యాప్తు చేస్తున్నామని అమ్రాబాద్ సిఐ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా గ్రామస్తులు సదరు యువకులను ప్రశ్నించగా గత కొన్ని రోజుల నుండి ఈ గ్రామంలోని గంజాయి తీసుకెళ్తున్నామని యువకులు చెప్పడం విన్నా గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన ఒక రైతు గాంజాయి సాగు చేస్తూ యువకులకు సప్లై చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాగిన మైకంలో యువత తన జీవితాన్ని చిన్న వయసులోనే మత్తుకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గత ఐదారు సంవత్సరాల నుండి నల్లమల్ల అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని పట్టణాలు మండల కేంద్రాలు గ్రామాలలో యువత విచ్చలవిడిగా గంజాయి తాగడాన్ని చూస్తుంటే నల్లమల ప్రాంతంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారు తెలియవస్తుంది. ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఎంత తనిఖీ చేసిన గంజాయిని నిర్వదించ లేకపోవుచున్నారు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గత కొంతకాలంగా గాంజాయకి బానిసలై కుటుంబానికి గ్రామస్తులకు కొరగని కొయ్యగా తయారైతు దాడులకు దాడి చేసుకోవడానికి వెనకాడడం లేదని గ్రామానికి చెందిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అచ్చంపేట పట్టణ శివారులోని కొన్ని టీ పాయింట్ దగ్గర రాత్రి 11 గంటల సమయం లో గంజాయి సిగరెట్లు అమ్ముతున్నట్లు తెలుస్తుంది ఈ ప్పటికైనా అధికారులు గంజాయి సిగరెట్లను గంజాయిని అక్రమ దిగుమతులను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat