బాలరాజన్న ప్రచారానికి ఉప్పెనల కదిలి వచ్చిన ఉప్పునుంతల ప్రజలు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin
బాలరాజన్న ప్రచారానికి ఉప్పెనల కదిలి వచ్చిన ఉప్పునుంతల ప్రజలు.
• విజయకేతనాన్ని తలపించిన ప్రచార స్వాగతం..
• భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులు, గ్రామస్థులు
• హ్యాట్రిక్ విజయం జిబిఆర్ దే అంటూ కేరింతలు
ఎన్నికల ప్రచారంలో భాగంగా అదివారం ఉప్పునుంతల మండల కేంద్రంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి ప్రచారం నిర్వహించిన అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారు..
🚗 కారు గుర్తుకే ఓటేద్దాం, ప్రజలకు సంక్షేమాన్ని అందించే ప్రభుత్వాన్ని గెలిపిద్దాం అని, మరోసారి సీఎం కేసీఆర్ గారిని, తనని గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ది అంటేనే తెలంగాణ అని, ప్రతి పల్లె సంక్షేమ పథకాలు, అభివృద్ధి అందుతున్నాయని వివరించారు.
అంతక ముందు మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా మండల కేంద్ర ప్రజలు విజయకేతనాన్ని తలపించేల ప్రచార స్వాగతం పలికారు. హ్యాట్రిక్ విజయం జిబిఆర్ దే అంటూ కేరింతలు కొడుతూ చిందులేశారు.
💠 ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాపతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.