ఉప్పునుంతల మండలం మర్రి పల్లి వృధుడు కరోనా తో మరణం.
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి వాసి గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ మృతి – జిల్లా కలెక్టర్ శ్రీధర్
హైదరాబాద్ కాటేదాన్ నందు పనిచేస్తున్న నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామ వాసీ 60 ఏళ్ల వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ మరణించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ఇతను ఇటీవల లాక్ డౌన్ కారణంగా సొంత గ్రామానికి వచ్చాడని, ఇతనికి డయాబెటిస్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నందున గత వారం క్రిందటే హైదరాబాద్ చికిత్స నిమిత్తం వెళ్లాడని, హైదరాబాదులో కరోనా సోకగా గాంధీ ఆస్పత్రికి తరలించారని, చికిత్స పొందుతున్న అతను మరణించినట్లు కలెక్టర్ శ్రీధర్ శనివారం తెలిపారు. అతనికి సంబంధించిన ఇప్పటివరకు ఏడు గురు ప్రైమరీ కాంటాక్ట్స్ ని గుర్తించడం జరిగిందని ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న వివరాలను వైద్య అధికారులు దర్యాప్తు చేస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు.
corona dead in marripally
ఈ నేపథ్యం లో మర్రిపల్లి లోని ప్రజలు అపప్రమత్తంగా ఉండాలని, మాస్క్ లు ధరించాలని అదేవిదంగా భౌతిక దూరం పాటించాలని ఇంకా ఎవ్వరు కరోనా మహమ్మారి బారిన పడకూడని వైద్య అధికారులు సూచిస్తున్నారు.
ఉప్పునుంతల మండలం లోని ప్రజలు కూడా ఈదేవిదంగా తగు జాగ్రత్తలు తీసుకోని జాగ్రత్తగా ఉండాలని తెలియ చేసారు ముక్యంగా వృద్దులు చిన్నపిల్లలా ను కరోనా ఎక్కువ గ ప్రభావితం చేస్తుందని వారిని కాపాడుకోవలసిన బాధ్యత కుటుంబ సభ్యుల మీద ఉన్నాడని తరుచు వారికీ వేడినీళ్లు మరియు నిమ్మనిల్లు తేనే లాంటివి తరుచు ఇస్తూ శేరీరం లో రోగ నిరోధక షెక్తిని పెంపొందించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
corona dead in marripally
హైదరాబాద్ పట్టణానికి వలస వెళ్లినటువంటి వారు తమ స్వగ్రామానికి వచ్చిన తరువాత కొన్ని రోజుల పాటూ ఎవ్వరిని కలవకుండా భౌతిక దూరం పాటించాలని తప్పని సరిగా మాస్కు లు ధరించి తరుచు సబ్బుతో చేతులను శుభ్రాంగా 20 నిమిషాల పాటూ కడుక్కోవాలి తెలియ చేసారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin