కొల్లాపూర్ రాజకీయ పరిస్థితి.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin
ఈ ఒక్క బొమ్మ చాలు… కొల్లాపూర్ రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోడానికి.!!
ఎక్కడో ఓ మారుమూల..వెనుఖబడిన ప్రాంతంలో అంతకంటే వెనుకబడిన ఓ సామాన్యురాలు దొర లతో,పెత్తందార్లతో,జమీందార్లతో పోరాడటమంటే చిన్నవిషయం కాదు..ఇది ఎన్నికల సమరంకాదు..
సామాజిక విప్లవం.పిల్లిమెడకు ఎవరో ఒకరు గంట కట్టాలి..శిరీష కట్టింది..జనంలో చైతన్యం వచ్చింది. లోకమంతా ఏకమై విజిలేస్తోంది..ఆ సౌండ్ కు… ఇప్పటికే ప్రకంపనలు మొదలయ్యాయి..నాడు..
అంబేత్కర్ కూడా ఇలానే సమాజంలో చైతన్యం.. తెచ్చారు.. అంబేద్కర్ బాటలోనే శిరీషనడుస్తోంది. శిరీష గెలుస్తుందా? లేదా? అనేది పక్కనబెడితే.. ఓ సాధారణ యువతి ఇలా ధైర్యంగా ముందు
కొచ్చి నామినేషన్ వేయడమే పెద్దగెలుపు….!!
దశాబ్దాల రాజకీయ దురంధరులకు ప్రతీకగా సింహాలు పులులు ఎలుగుబంట్లు మహిషాసుర మర్దనిగా బర్రెలక్క చిత్రం భావాత్మకంగా వుంది. ఎవ రైనా ఈ చిత్రంతో కటౌట్లు,బ్యానర్లు,హోల్డింగ్స్ ను ఆ నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తే..కాగల కార్యం చాలావరకు నెరవేరుతుంది.ఈఒక్కబొమ్మచాలు.. అక్కడి పరిస్థితి యేమిటో చెప్పకనే చెప్పడానికి…డబ్బు న్నోళ్ళు,దొరలు,భూస్వాములు,మోతుబర్లు గుర్రా
లమీదొస్తారు..ఓ పేదరాలు ఇలా బర్రెమీద స్వారీ చేస్తూ..పులులు,సింహాల వంటి మోతుబర్లను… ఎదుర్కోవడం సింబాలిక్ గా వుంది..వెయ్యి ఉప న్యాసాలు చేయలేని పనిని,ప్రచారాన్ని ఈ ఒక్క
చిత్రం చేస్తుందనడంలో అతిశయోక్తిలేదు..
బర్రెలక్క శిరీషకు విజయోస్తు….!!