సీఎం కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు మైనారిటీలకు గత ప్రభుత్వ హాయంలో ఎవరు కూడా ఇవ్వలేదు
సీఎం కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు మైనారిటీలకు గత ప్రభుత్వ హాయంలో ఎవరు కూడా ఇవ్వలేదు
– హజ్రత్ సయ్యద్ ఆలే ముస్తఫా ఖాద్రీ ఉర్ఫ్ అలీ పాషా సాహేబ్ గారు
• అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారికి మద్దతుగా మైనారిటీ నాయకులతో అచ్చంపేట పట్టణంలో సమావేశం
అచ్చంపేట: సీఎం కెసిఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు మైనారిటీలకు గత ప్రభుత్వ హాయంలో ఎవరు కూడా ఇవ్వలేదని హజ్రత్ సయ్యద్ ఆలే ముస్తఫా ఖాద్రీ ఉర్ఫ్ అలీ పాషా సాహేబ్ గారు అన్నారు. సోమవారం పట్టణంలో ముస్లిం మైనార్టీ నాయకులు, మహిళలలు మరియు అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారితో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా సమావేశం నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ మైనారిటీలను గుర్తించింది కేసీఆర్ గారి ప్రభుత్వమేనని, మైనార్టీలకు తోడుగా షాది ముబారక్, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
🔸 తెలంగాణలో మళ్లీ వచ్చేది సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వమేనని అచ్చంపేట అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గువ్వల బాలరాజు గారిని విజయంతో గెలిపించాలని తెలిపారు.
మైనారిటీలు అందరూ ఒక్కటై రాష్ట్రంలో కేసీఆర్ గారిని అచ్చంపేటలో గువ్వల బాలరాజు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మరిన్ని సదుపాయాలు మనమందరం కల్పించుకుందామని వివరించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.