అచ్చంపేట 2.వ వర్డ్ సాయినగర్ లో ఊపందుకున్న కాంగ్రెస్…
అచ్చంపేట 2.వ వర్డ్ సాయినగర్ లో ఊపందుకున్న కాంగ్రెస్…
ఈ సందర్బంగా అడ్వాకెట్ రాజేందర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ వస్తే మనం బాగుపడతాం అని కొట్లాడి తెచ్చుకున్నాం అన్నారు.
దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ వచ్చిన తరువాత ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు కొడుకుని, అల్లుడిని మంత్రులను చేసాడు బిడ్డని ఎంపీ ని చేసాడు ఇంట్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చాడు కానీ ఎన్నో భలిదానాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డాడు. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ చేస్తానన్నాడు కానీ బొందలగడ్డ చేసిండు, తెలంగాణ లో ప్రతి గ్రామం లో ప్రతి వీధిలో వైన్ షాపులు పెట్టి తాగుబోతు తెలంగాణ చేసిండు మన నిధులు తిసుకేల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెట్టాడు.
కాంగ్రెస్ పార్టీ కట్టిన జూరాల ప్రాజెక్టు ఇంకా పటిష్టంగా ఉంది. కానీ కాళేశ్వరం మాత్రం కుంగి పోయింది. కేసీఆర్ 5 సంవత్సరాలకు ఒక్క సరి వచ్చి మాయల ఫకీరు లాగా మాయం చేస్తాడు అందుకని అందరం అప్రమత్తంగా ఉండాలన్నారు.
మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీ కృష్ణ గారిని అత్యధిక మెజారితో తో గెలిపించి అచ్చంపేటకు పట్టిన దారిద్య్రాన్ని వెళ్ళగొట్టాలని పిలునిచ్చారు.
ఈ కార్య క్రమం లో తెలంగాణ ఉద్యమకారుడు అడ్వాకెట్ రాజేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎం రెడ్డి, కౌన్సిలర్ గౌరీశంకర్, కటకం రఘురాం, లాలూ యాదవ్ , సలేశ్వరం, మరియు పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.