ఈరోజు నుంచి కొత్త రూల్స్.. మారే 9 అంశాలు ఇవే…

0
schools reopen in achampet from feb1st
Share

ఈరోజు నుంచి కొత్త రూల్స్.. మారే 9 అంశాలు ఇవే.. మీపై ఎఫెక్ట్!

పిబ్రవరి వచ్చేసింది. schools reopen in achampet వస్తూవస్తూనే కొత్త రూల్స్ కూడా తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. దీని వల్ల చాలా మందిపై ప్రభావం పడనుంది.

కొత్త ఏడాది తొలి నెలకు బై బై చెప్పేశాం. ఇప్పుడు ఫిబ్రవరి నెలలోకి అడుగు పెట్టేశాం. కొత్త నెల వస్తూ వస్తూనే కొత్త రూల్స్ కూడా తీసుకువచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయి. దీంతో నేరుగానే చాలా మంది ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల ఈరోజు నుంచే మారే అంశాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

schools reopen in achampet from feb1st

1. పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB కొత్త రూల్ తీసుకువచ్చింది. ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్ నిబంధనను సవరించింది. ఈరోజు నుంచి నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి పీఎన్‌బీ కస్టమర్లు డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం కుదరదు.

2. గ్యాస్ సిలిండర్ ధర ప్రతి నెలా మారుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ధరలో మార్పు లేకపోవచ్చు. స్థిరంగా కూడా ఉండొచ్చు. దీంతో ఫిబ్రవరి 1న కూడా LPG Cylinder Price గ్యాస్ సిలిండర్ ధర మారొచ్చు. లేదంటే నిలకడగానే కొనసాగవచ్చు.

3. వాహనదారులు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఫిబ్రవరి 15 నుంచి అన్ని వెహికల్స్ కచ్చితంగా FASTag ఫాస్టాగ్స్‌ను కలిగి ఉండాలి.

4. ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC రైల్వే ప్రయాణికులకు తీపికబురు అందించింది. ఫిబ్రవరి 1 నుంచి ఇకేటరింగ్ సర్వీసులు స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

5. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 19 నిబంధనలను సరళీకరించింది. ఫిబ్రవరి 1 నుంచి సినిమా హాల్స్ అన్ని ఫుల్‌ కెపాసిటీతో నడుస్తాయి. schools reopen in achampet

6. కోవిడ్ 19 దెబ్బకి స్కూల్స్ అన్నీ బంద్‌లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఇవి తెరుచుకుంటున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్, కాలేజీలను తెరవడానికి అనుమతులు ఇచ్చాయి.

7. మహరాష్ట్ర ప్రభుత్వం సబ్ అర్బన్ ట్రైన్ సర్వీసులకు Train Services పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ సేవలు మళ్లీ అందుబాటులోకి వస్తాయి.

8. కేంద్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ Pension పొందే వారు ఫిబ్రవరి నెల చివరి లోపు జీవన్ ప్రమాణ్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో EPFO ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

9. ఫిబ్రవరి 1 నుంచి దేశంలోని ఓటర్లు అందరూ డిజిటల్ ఓటర్ కార్డులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. eEpic సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *