బీటెక్ విద్యార్థులకు.. సెప్టెంబర్ 15 నుంచి నూతన విద్యా సంవత్సరం షురూ..!
బీటెక్ విద్యార్థులకు.. సెప్టెంబర్ 15 నుంచి నూతన విద్యా సంవత్సరం షురూ..!
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో విద్యా సంవత్సరం వాయిదా పడింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల విద్యా సంవత్సరం సెప్టెంబర్ 15న మొదలుకానుంది. ఈ మేరకు గురువారం అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) రివైజ్డ్ అకడమిక్ క్యాలెండర్‌ను జారీ చేసింది. Engineering Admission Process 2020-2021
గతంలో ఫస్ట్ ఇయర్ లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబర్ ఒకటి, ఇతర విద్యార్థులకు ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను సవరించింది. కొత్తగా కాలేజీల్లో చేరే విద్యార్థులకు సెప్టెంబర్ 15వ తేదీ నుంచి తరగతుల(విద్యా సంవత్స రం)ను ప్రారంభించాలని పేర్కొంది.
ప్రస్తుత విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులను మొదలుపెట్టాలని సూచించింది. యూనివర్సిటీల అనుబంధ గుర్తింపును గతంలో జూన్ 30 వరకు ఇవ్వాలని పేర్కొనగా, ఇప్పుడు దానిని సవరించి జూలై 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఆగస్టు 30లోగా మొదటి దశ, సెప్టెంబర్ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్ పూర్తి చేయాలని, మిగిలిన సీట్లను సెప్టెంబర్ 15లోగా పూర్తి చేయాలని పేర్కొంది. పీజీసీఎం/పీజీడీఎం కోర్సుల్లో చేరిన వారికి ఆగస్టు 1వ తేదీకల్లా తరగతులు ప్రారంభించాలని పేర్కొంది.
Engineering Admission Process 2020-2021
ఈ దేతరహాలో మిగితా ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఉండబోతున్నాయి అని విద్యార్థులు తల్లి దండ్రులు ఎదురుచూస్తున్నారు టెన్త్, ఇంటర్, డిగ్రీ, మరియు ఇతర ఎడ్యుకేషన్ బోర్డ్స్ కూడా ఈ పరిణామం లో ఆలోచిస్తే బాగుంటుందని లేదంటే విద్యార్థులు ఈ అకడమిక్ ఇయర్ ని చాల నష్టపోయే అవకాశం ఉంది, ఇప్పటికే కొంతభాగం సిలబస్ ఐపోవలసింది. కొన్ని కార్పొరేట్ విద్య సంస్థలు పిల్లలను అట్రాక్ట్ చేయడానికి ఆన్లైన్ క్లాసెస్ చెబుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ విని ఎంతమాత్రం అర్ధం చేసుకుంటారో వేచిచూడాల్సిందే.
ప్రభుత్వం చొరవ తీసుకోని విద్యార్థుల విషయం లో తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin