ఆర్‌టిసిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్.
ఆర్‌టిసిలో రోజువారీ ప్రతిపాదికన డ్రైవర్లు, కండక్టర్లు, ట్రాఫిక్, మెకానికల్ సిబ్బందికి ఆహ్వానం
డ్రైవర్‌కు రోజుకు రూ.1,500, కండక్టర్‌కు రూ. 1000, మెకానిక్స్, శ్రామిక్స్, ఎలక్ట్రిషియన్స్, టైర్ మెకానిక్, గుమాస్తాలకు రూ.1000 పారితోషికం
దాదాపు 20వేల మందికి అవకాశం
రోజువారీ ప్రాతిపదికన ఆర్‌టిసిలో అదనపు డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్థులకు రోజువారీ డ్రైవర్‌కు రూ.1,5 00, కండక్టర్‌కు రూ.1,000 చొప్పున పారితోషికం ఇవ్వనున్నది. ఆర్‌టిసిలో పనిచేయడానికి ఆసక్తిగల రిటైర్డ్ ట్రా ఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్లకు రోజువారీ పారితోషికం రూ.1,500 చెల్లించనున్నది. ఆయా డిపోల్లో రోజుకు రూ. 1,000 చొప్పున రిటైర్డ్ మెకానిక్స్, శ్రా మిక్స్‌లతో పాటు ఎలక్ట్రీషన్స్, టైర్ మెకానిక్స్, క్లరికల్‌గా పనిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులే కాక ఇతర శాఖల్లో పనిచేసిన డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి టిఎస్‌ఆర్‌టిసి దరఖాస్తులు ఆహ్వానించింది.
ఆర్‌టిసికి చెందిన ఒల్వా, ఎసి, మల్టీ యాక్సిల్స్ బస్సులను నడిపేందుకు అనుభవనం ఉన్న డ్రైవర్లు, మెకానిక్స్‌ల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తోం ది. ఎసి బస్సులు నడిపే డ్రైవర్, మెయింటెన్స్ చేసే మెకానిక్‌కు రోజువారీగా రూ.2,000 అందజేయనున్నది. రోజువారీ పద్ధతిలో ఐటీ ట్రైనర్‌గా తీసుకున్న సాఫ్ట్‌వేర్ నిపుణులకు రూ.1,500 పారితోషికం టిఎస్‌ఆర్‌టిసి ఇవ్వనున్నది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, రవాణా శాఖ జిల్లా అధికారులను సంప్రదించవచ్చు.
|
TSRTC ఆర్‌టిసిలో రోజువారీ ప్రతిపాదికన డ్రైవర్లు, కండక్టర్లు, ట్రాఫిక్, మెకానికల్ సిబ్బందికి ఆహ్వానం
డ్రైవర్‌కు రోజుకు రూ.1,500, కండక్టర్‌కు రూ. 1000, మెకానిక్స్, శ్రామిక్స్, ఎలక్ట్రిషియన్స్, టైర్ మెకానిక్, గుమాస్తాలకు రూ.1000 పారితోషికం
దాదాపు 20వేల మందికి అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: రోజువారీ ప్రాతిపదికన ఆర్‌టిసిలో అదనపు డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్థులకు రోజువారీ డ్రైవర్‌కు రూ.1,5 00, కండక్టర్‌కు రూ.1,000 చొప్పున పారితోషికం ఇవ్వనున్నది. ఆర్‌టిసిలో పనిచేయడానికి ఆసక్తిగల రిటైర్డ్ ట్రా ఫిక్, మెకానికల్ సూపర్‌వైజర్లకు రోజువారీ పారితోషికం రూ.1,500 చెల్లించనున్నది. ఆయా డిపోల్లో రోజుకు రూ. 1,000 చొప్పున రిటైర్డ్ మెకానిక్స్, శ్రా మిక్స్‌లతో పాటు ఎలక్ట్రీషన్స్, టైర్ మెకానిక్స్, క్లరికల్‌గా పనిచేసేందుకు ఆసక్తిగల అభ్యర్థులే కాక ఇతర శాఖల్లో పనిచేసిన డ్రైవర్లు, రిటైర్డ్ ఉద్యోగుల నుంచి టిఎస్‌ఆర్‌టిసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆర్‌టిసికి చెందిన ఒల్వా, ఎసి, మల్టీ యాక్సిల్స్ బస్సులను నడిపేందుకు అనుభవనం ఉన్న డ్రైవర్లు, మెకానిక్స్‌ల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరిస్తోం ది. ఎసి బస్సులు నడిపే డ్రైవర్, మెయింటెన్స్ చేసే మెకానిక్‌కు రోజువారీగా రూ.2,000 అందజేయనున్నది. రోజువారీ పద్ధతిలో ఐటీ ట్రైనర్‌గా తీసుకున్న సాఫ్ట్‌వేర్ నిపుణులకు రూ.1,500 పారితోషికం టిఎస్‌ఆర్‌టిసి ఇవ్వనున్నది. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు తమ సమీప డిపో మేనేజర్ లేదా మోటర్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్, రవాణా శాఖ జిల్లా అధికారులను సంప్రదించవచ్చ.
దాదాపుగా 20వేల ఉద్యోగాలు…
టిఎస్ ఆర్‌టిసిలో దాదాపుగా 20 వేల మందికి పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్నున్నది. రాష్ట్ర వ్యాప్త ఆర్‌టిసి సమ్మెలో సుమారు 48 వేల మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. సమ్మె మొదలైన నాటి నుంచి ఆర్‌టిసిలో 6 వేలకు పైగా డ్రైవర్, కండక్టర్ ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం నియమించింది. 50 శాతం ఆర్‌టిసి సొంత బస్సులు నడుపుతామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇంకా 20 వేల మందికి టిఎస్ ఆర్‌టిసిలో ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
నూరుశాతం బస్సులు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌టిసి సమ్మె జరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న ప్రత్యామ్నాయ చర్యలతో ఏనాడూ ప్రగతి రథచక్రం ఆగలేదు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించి ప్రజారవాణాకు ఇబ్బందులు లేకుండా సిఎం కెసిఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మూడు రోజుల్లోనే వంద శాతం బస్సులు నడవాలని శనివారం సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆఘమేఘాల నియామకాల ప్రక్రియను చేపడుతున్నారు. తెలంగాణలోనే అతిపెద్ద దసరా పండుగ ముందు నుంచే ఆర్‌టిసి సమ్మె మొదలైన నేపథ్యంలోనూ ప్రజారవాణాను పరుగులు పెట్టించారు.
ఆర్‌టిసి, ఆర్‌టిఏ శాఖల సమన్వయంతో రవాణా అవసరాలకు అనుగుణంగా వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతానికి పైగా వాహనాలు నడుస్తున్నాయి. మూడు రోజుల్లో వంద శాతం బస్సులు నడుస్తాయని శనివారం సిఎం కెసిఆర్ ప్రకటించారు. బంద్ మొదలైనప్పటి నుంచి 6వేలకు పైగా తాత్కాలిక డ్రైవర్, కండక్లర్‌లను ప్రభుత్వం నియమించింది.