స్కూల్ విద్యార్థులకు టీవీ పాఠాలు.. 6-10 తరగతుల వరకు కసరత్తు
స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్‌లైన్ కనెక్టివిటీ లేదు. కంప్యూటర్లు లేవు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని టీశాట్, దూరదర్శన్ (యాదగిరి) వంటి టీవీ చానళ్ల ద్వారా రికార్డు చేసిన వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు కసరత్తు చేస్తోంది.Television Free Education in-Telangana
గతంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన వీడియో పాఠాలు, రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ (ఎస్‌ఐఈటీ) రూపొందించిన తరగతుల వారీగా వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని సద్వినియోగ పరచుకునేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
వాటితోపాటు అవసరమైన పాఠాలను రికార్డు చేసి ప్రసారం చేస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది. రాష్ట్రంలోని 40,597 పాఠశాలల్లో 58 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. అందులో 31 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉంటే 27 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నారు.
Television Free Education in-Telangana
ఆరో తరగతి నుంచి ప్రారంభం:
ఈ వీడియో పాఠాలు ఆరో తరగతి నుంచే ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకే వీడియో పాఠాలను ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో తరగతికి రెండు గంటల చొప్పున మూడు తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఒక్కోక్లాస్ అరగంట ఉండేలా.. ప్రతి తరగతికి మధ్య 10 నుంచి 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు వర్క్‌షీట్ల ద్వారా సబ్జెక్టుపై అవగాహన కల్పించేలా కసరత్తు చేస్తున్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin