• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

కొబ్బరి కల్లు.. శ్రీలంక నుంచి ప్రపంచమంతా ప్రయాణిస్తున్న మత్తు పానీయం.

Share Button

తాటికల్లు, ఈత కల్లు గురించి తెలిసేందే. మరి కొబ్బరి కల్లు గురించి ఎప్పుడైనా విన్నారా? కొబ్బరి చెట్టు నుంచి తీసే ఈ కల్లు శ్రీలంకలో చాలా ఫేమస్.

ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లోకి దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనిపై బీబీసీ ప్రతినిధి అయేశా పెరీరా కొలంబో నుంచి అందిస్తున్న ప్రత్యేక కథనం.

లండన్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఇప్పుడు ఈ కొబ్బరి కల్లును అందిస్తున్నారు. దివంగత ట్రావెల్ అండ్ ఫుడ్ రచయిత ఆంథోనీ బౌర్డెయిన్ దీని గురించి ప్రస్తావిస్తూ ”విస్కీని, రమ్‌తో కలిపితే వచ్చే స్ట్రాంగ్ ద్రావకం.. మత్తెక్కించే అద్భుతం ఈ కొబ్బరి కల్లు” అని అభివర్ణించారు.

అయితే, స్థానికులు మాత్రం ఈ మత్తు పానీయాన్ని డార్క్ రమ్‌ అని పిలుస్తుంటారు. శ్రీలంకలోని దిగువ తరగతి ప్రజల దీన్ని ప్రీమియం అల్కహాల్‌గా భావిస్తారు. రాజధాని కొలంబోలోని ధనిక వర్గాలు ఈ కొబ్బరి కల్లును కాకుండా స్కాచ్, విస్కీ లేదా రమ్‌ను మాత్రమే తీసుకుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat