• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

Share Button

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

కరోనా వైరస్ నేపధ్యంలో 9 నుంచి 12వ తరగతుల వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 30 శాతం సిలబస్ కుదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సీబీఎస్ఈ 30 శాతం సిలబస్‌ను కుదించినట్లుగానే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. inter syllabus revised 30%

inter-syllabus-2020

ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సిలబస్ సీబీఎస్ఈలో, రాష్ట్రంలో ఒకే మాదిరిగా ఉంటుంది కాబట్టి ఆయా గ్రూపుల్లో సీబీఎస్ఈ తొలగించే పాఠ్యాంశాలను రాష్ట్రంలోనూ తొలగించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా తొలగించాల్సిన పాఠాలపై కసరత్తు ప్రారంభించారు. ఇక ఆర్ట్స్ గ్రూపుల్లో ఏ సిలబస్‌ను తగ్గించాలన్న దానిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నేపథ్యం లో ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్ చెప్పుతున్నారు కానీ వారు చెప్పినటువంటి సబ్జక్ట్స్ అన్ని ఈ సిలబస్ లో ఉంటాయా లేదా తొలగించా బడతాయా అని చూడాల్సి ఉంది. అధిక సంఖ్య లో విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారు.

అదేవిదంగా విద్యార్థుల తల్లి దండ్రులు తమ పిల్లల భవిషత్తు ఏమవుతుందో అని వ పోతున్నారు ఇది ఇలాఉండగా 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు చదివే పిల్లల సంగతి అయోమయం లో పడిపోయింది అసలు విద్య సంస్థలు తెరుస్తారు లేదా అని భయపడుతున్నారు ఇప్పటికే కొంతమంది తల్లి దండ్రులు ఫీజులు చెల్లించారు పుస్తకాలూ కొనుగోలు చేసారు. inter syllabus revised 30%

ఇక గవర్నమెంట్ స్కూల్స్ గత సంవత్సరం విద్యార్థుల తల్లి దండ్రులను ఒప్పించి చాల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించారు కానీ ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి అయోమయం లో పడిపోయింది గ్రామీణ ప్రాంతాలలో చాలామంది పిల్లలు ఈ తమ తమ వృత్తిపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమై పోయారు వారిని తిరిగి విద్యాలయాలకు రప్పించడానికి చాల కస్టమైనటుంవటి పనిగా భావిస్తున్నారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat