టీఎస్ టెన్త్ 2021 పరీక్షల షెడ్యూల్: పరీక్షల సమయం అరగంట పెంపు..

0
10 thclass exam schedule 2020

టీఎస్ టెన్త్ 2021 పరీక్షల షెడ్యూల్: పరీక్షల సమయం అరగంట పెంపు..

కరోనా నేపథ్యంలో మే 17 నుంచి 26 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై వీలైనంత వరకు ఒత్తిడి లేకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

ఇప్పటికే 11 పేపర్లకు బదులు 6 పేపర్లతోనే పరీక్షలను నిర్వహించనున్న ప్రభుత్వం తాజాగా విద్యార్థులకు రెట్టింపు ఆప్షన్లు ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందించనుంది. అలాగే పరీక్షల సమయాన్ని అరగంటపాటు పెంచింది. ప్రత్యక్ష విద్యా బోధన సకాలంలో అందుబాటులోకి రాక, ఆన్‌లైన్/డిజిటల్ బోధన అందరికీ పూర్తిస్థాయిలో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకుంటూ పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేసింది. ssc examination timetable 2021

10 thclass exam schedule 2020

అలాగే పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి మంగళవారం వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 25 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఆలస్య రుసుముతో వచ్చే నెల 16 వరకు ఫీజు చెల్లించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

telangana-ssc-timetable-2021

ప్రతి పరీక్షకు 3:15 గంటల సమయం..

పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటాయి. ప్రతి పరీక్షకు 3:15 గంటల సమయం ఉంటుంది. గతంలో 2:45 గంటల సమయమే ఉండగా ఈసారి అరగంట అదనంగా పెంచారు. వొకేషనల్ కోర్సు పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకే ఉంటాయి. – అన్ని సబె ్జక్టుల ఆబ్జెక్టివ్ పేపర్లు (పార్ట్-బీ) పరీక్షల చివరి అరగంట ముందే ఇస్తారు. ssc examination timetable 2021

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *