వంట గ్యాస్‌పై 50 పెంపు & ఆగని పెట్రో మంట

వంట గ్యాస్‌పై 50 పెంపు
వంట గ్యాస్ ధర మరో సారి పెరిగింది. 14.2 కేజీల గృహావసర సిలిండర్‌పై ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రూ. 50 పెంచాయి. పెంపు అనంతరం ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 769కి చేరింది. ఈ పెంపు నేటి(సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. అంతర్జాతీయ చమురు ధరల ఆధారంగా నెలవారీగా చమురు సంస్థలు ఈ ధరను సమీక్షిస్తాయి. గృహావసర ఎల్పీజీ సిలిండర్లపై ప్రస్తుతం ప్రభుత్వం సబ్సీడీ ఇస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. gas agency in achampet
ఆగని పెట్రో మంట:
దేశంలో వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆదివారం పెట్రో ల్ ధర లీటరుకు 29 పైసలు, డీజిల్ ధర 32 పైసలు పెరిగింది. దీంతో రాజస్తాన్‌లోని గంగానగర్ టౌన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.29కి చేరగా డీజిల్ ధర రూ. 91.17కి చేరింది. దేశంలోకెల్లా రాజస్తాన్‌లో అత్యధిక పన్ను లు ఆయిల్ రేట్లపై వడ్డిస్తున్న కారణంగా ఈ రేట్లు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర జీవిత కాల గరిష్టానికి రూ. 88.73కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 79.06కు చేరకుంది.gas agency in achampet
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin