3 నెలలు గ్యాస్ సిలిండర్లు ఉచితం.. కేంద్రం అదిరిపోయే శుభవార్త!
3 నెలలు గ్యాస్ సిలిండర్లు ఉచితం.. కేంద్రం అదిరిపోయే శుభవార్త!
మోదీ సర్కార్ తీపికబురు అందించింది. పేదలకు ఊరట కలిగే నిర్ణయం తీసుకుంది. ఉజ్వల స్కీమ్‌లో చేరిన వారికి మరో మూడు నెలల పాటు ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని ప్రకటించింది. Free domestic cooking-gas cylinders
ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది. ఉజ్వల స్కీమ్‌లో చేరిన వారికి మరో మూడు నెలలపాటు ఉచితంగానే గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. జూలై 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఇలాగే ఇప్పుడు మరో 3 నెలలపాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్ భారాన్ని కేంద్రమే భరించనుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో కంపెనీ కంట్రిబ్యూషన్ 12 శాతం, ఉద్యోగి కంట్రిబ్యూషన్ 12 శాతం మొత్తంగా 24 శాతాన్ని కేంద్రమే ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ ఫెసిలిటీ అందిస్తోంది.
Free domestic cooking-gas cylinders
తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై ఏకంగా రూ.4860 కోట్ల భారం పడనుంది. దాదాపు 72 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అలాగే గరీబ్ కల్యాణ్ యోజన స్కీమ్‌ను కూడా నవంబర్ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.
కాగా మరోవైపు రూ.లక్ష కోట్లతో అగ్రికల్చర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్లను గ్రామాలకు చేర్చుతామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర ఏజెన్సీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
నవంబర్ వరకు పొడిగించిన కోవిడ్ -19 సంక్షోభం మధ్య పేదలు మరియు బలహీనంగా ఉన్నవారికి ఉపశమనం కలిగించడానికి పిఎమ్ గారిబ్ కల్యాణ్ అన్నా యోజన (పిఎంజికె) నేపథ్యంలో ఇది వచ్చింది. లాక్డౌన్ చిన్న వ్యాపారాలు, ప్రధాన ఉద్యోగ సృష్టికర్తలు మరియు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వెన్నెముకగా దెబ్బతిన్నప్పటికీ, ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు, వలస కార్మికులకు మరియు రైతులకు చేరేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin