కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు.?

0
10 thclass exam schedule 2020

కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు.?

తెలంగాణ సర్కార్.. ఈ సంవత్సరం బీఎ, బీఎస్సీ, బీకాం డిగ్రీ పరీక్షలను సైతం పూర్తిగా రద్దు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. డిగ్రీ, బీటెక్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో విద్యాశాఖ అధికారులు సమావేశమయ్యారు.

Telangana cancels degree exams

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. విధ్యార్ధులను పైతరగతులకు ప్రమోట్ చేసిన తెలంగాణ సర్కార్.. ఈ సంవత్సరం బీఎ, బీఎస్సీ, బీకాం డిగ్రీ పరీక్షలను సైతం పూర్తిగా రద్దు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. Telangana cancels degree exams

డిగ్రీ, బీటెక్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఇంచార్జి వీసీలు, రిజిస్ట్రార్లు, ప్రొఫెసర్లు సమావేశం కాగా.. అందరూ కూడా పరీక్షలను రద్దు చేసి.. డిగ్రీ ఫస్ట్, సెకండియర్ విద్యార్ధులను ప్రమోట్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఇక ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌కు ఇంటర్నల్ మార్క్స్ ఆధారంగా పాస్ చేయాలని అధికారులు ప్రతిపాదించారట.

అటు జేఎన్టీయూహెచ్, ఓయూ, ఇతర యూనివర్సిటీల పరిధిలో నిర్వహించే బీటెక్ పరీక్షల రద్దు అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్, అలాగే ఆగష్టు 15 నుంచి డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్ క్లాసులను నిర్వహించడంపై కూడా అధికారులు చర్చించారు. ఇక ఈ ప్రతిపాదనలను అన్నీ కూడా సీఎం కెసిఆర్ ఓకే చెప్పిన తర్వాతే అమలు చేయనున్నారు.

Telangana cancels degree exams

కరోనా సమయం లో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి వీలుకాని సందర్భం లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇది ఇలా ఉండగా రాష్టంలో విద్యార్థుల పాస్ పర్సెంటేజ్ బాగా పెరిగి పై చదువులు చదువుకోవడానికి ఇది బాగా ఉపయోగ పడుతుందని నిపుణులు తెలియచేసారు అదేవిధంగా డిగ్రీ పాస్ పర్సెంటేజ్ పెరిగి ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *