• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు

Share Button

10th class exams conducting with the same hall tickets!

పాత హాల్ టికెట్లతోనే టెన్త్ పరీక్షలు

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు 10th class పదో తరగతి విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారిన తరుణంలో లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన పరీక్షలను జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి నెలలో విద్యార్ధులకు జారీ చేసిన హాల్ టికెట్లతోనే మిగిలిన పదో తరగతి పరీక్షలు జరుగుతాయని.. విద్యార్ధులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ స్టేట్ ఎస్ఎస్సీ బోర్డు స్పష్టం చేసింది. మొత్తం 5. 34 లక్షల మంది విద్యార్ధులకు గతంలో 2530 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఇప్పుడు ఆ పరీక్షా కేంద్రాలను రెట్టింపు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు.

10th class exams conducting with the same hall tickets
10th class exams conducting with the same hall tickets!

ఎగ్జామ్స్ నిర్వహణపై హైకోర్టు నుంచి ఉత్తర్వులు రాగానే ఈ నెలాఖరులోగా పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మిగిలిన పరీక్షలు కోసం విద్యార్ధులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టాలన్నారు. అంతేకాక కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాల్లో హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ప్రతీ బెంచ్‌కు ఒకరు మాత్రమే కూర్చునే విధంగా.. విద్యార్ధుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు.

ఈ తరుణం లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 1 గంట ముందు వచ్చి అక్కడున్న పరిస్థితులను గమనించుకొని పరీక్షా కేంద్రాలు కల్పించినటువంటి కరోనా వైరస్ నివారణ సదుపాయాలు ఉపయోగించు కొని వ్యాప్తిని అరికడుతూనే విద్యార్థులు తమ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేయాలనీ ప్రభుత్వం ఆకాంక్షితుంది.

విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేర్లు వెంటబెట్టుకొని వాటిని ఉపయోగిస్తూ పరీక్షా ను పూరీచేయాలని కోరుకుంటున్నాం అదేవిదంగా విద్యార్థుల తల్లి తండ్రులు కూడా పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చినపుడు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి పిల్లను పరీక్షా కేంద్రాలకు తీసుకోని రావాలని ప్రభుత్వం తెలియ జేస్తుంది.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat