Fire accident in ankura hospital | అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం
అంకుర ఆసుపత్రిలో రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది fire accident in ankura hospital.
Fire accident in ankura hospital హైదరాబాద్ మెహదీపట్నంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అంకుర ఆసుపత్రిలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలను ఆదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గుడిమల్కాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పై అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మొత్తం భవనం 10 అంతస్తుల్లో ఉండగా టెర్రస్ లో మంటలు వ్యాపించాయి. టెర్రస్ పైన ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు ఉండటంతో మంటలు వేగంగా పక్కకు విస్తరించాయి.
చిన్న పిల్లల ఆసుప్రతి కావడంతో ఎంత మంది మంటల్లో చిక్కుకున్నారు, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే అక్కడకు చేరకున్న మూడు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయిదవ ఫ్లోర్లో నేమ్ బోర్డ్ లో షాట్ సర్క్యూట్ జరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు గుర్తించారు. గంటసేపు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైరింజన్ సిబ్బంది
పై అంతస్తులో మంటలు వ్యాపించడంతో నిప్పు రవ్వలు గాల్లో ఎగురుతూ కిందకు పడ్డాయి. అసుపత్రిలోని పేషెంట్లను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆసుపత్రి సిబ్బంది. ఆసుపత్రిలో ఎక్కువ సంఖ్యలో గర్భిణీలు, చిన్న పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా రోగులను కాపాడే ప్రయత్నం చేశారు. రోగికి సంబంధించిన బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తి ట్రాఫిక్ ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin