ఇవాళ కేబినెట్ భేటీ. లాక్‌డౌన్ ఉంటుందా?
ఇవాళ కేబినెట్ భేటీ. లాక్‌డౌన్ ఉంటుందా ?
తెలంగాణల కేబినెట్ ఇవాళ భేటీ అవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు రోజురోజుకు పెరిగిపోవడం, మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం జరగడంతో ఇవాళ్టి కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. CM kcr cabinet meeting
జీహెచ్ఎంసీ పరిధిలో
మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా 945 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16, 339కి చేరింది. ఇప్పటి వరకు 260 మంది మృతి చెందగా.. 7,294 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 8,785 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 869 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 12,682 కేసులు నమోదయ్యాయి.
మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష.
CM kcr cabinet meeting
మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. టిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామకాల ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు. ఇంకా ఎంతమంది సిబ్బంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి, అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ పరిధిలో కరోనా పరీక్షా కేంద్రాలు.
హైదరాబాద్‌లో 11 ఆసుపత్రల్లో కరోనా పరీక్షల కోసం నమూనాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు. కింగ్ కోఠి హాస్పిటల్, ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ ఆసుపత్రి, నేచర్ క్యూర్ హాస్పిటల్, సరోజినీదేవి హాస్పిటల్, ఆయుర్వేద ఆసుపత్రి. హోమియోపతి ఆసుపత్రి, నిజామియా టీబీ ఆసుపత్రి, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, నాచారం ఇఎస్‌ఐ ఆసుపత్రి, సరూర్‌నగర్ ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంటాయని అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల సూచించారు.
దేశంలో నేటి నుంచి అన్‌లాక్ 2.0 అమల్లోకి వచ్చింది.
కంటైన్మెంట్ జోన్‌లలో ఈనెల 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర, నిత్యావసర సేవలు మినహా ఇతర అన్ని రకాల కార్యకలాపాలపై నిషేధం విధించారు. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుంది. మెట్రో రైల్, సినిమా హాళ్లు, జిమ్‌లు, స్మిమ్మింగ్ ఫూల్స్, సమావేశ మందిరాలు, వినోద పార్కులపై నిషేధం కొనసాగనుంది. రాజకీయ, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలపైనా నిషేధం కొనసాగనుంది. మరోవైపు వివిధ రాష్ట్రాల స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల కూడా ఆంక్షలు విధించే స్వేచ్చ ఇచ్చింది కేంద్రం.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin