డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి.
కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బల్మూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్, సీనియర్ నాయకులు లాల్ మహ్మద్, గ్రామ కార్యదర్శి ఆంజనేయులు, కృష్ణయ్య బాలయ్య మాసయ్య, మైనార్టీ నాయకులు రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి శంకర్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తున నెలకొల్పి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమని వారు అన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మతాల మధ్య కులాల మధ్య చిచ్చురేపి రాజకీయ ప్రయోజనాలు పొందడం దుర్మార్గమని వారు అన్నారు ఈ దేశంలో డాక్టర్ బాబు బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా ఐక్య ఉద్యమాలు పోరాటాలు ప్రజల హక్కుల కోసం ఉద్యమించాలని వారు గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా దళితులు గిరిజనులు మైనార్టీల పట్ల దాడులు విపరీతంగా పెరిగాయని వారు అన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin