బ్యాంకులకు 27 నుండి … ఏప్రిల్ 4వ తేదీ వరకు… వరుస సెలవులు
బ్యాంకులో పని ఉందా, వెంటనే పూర్తి చేసుకోండి.. లేదా! 27 నుండి వరుస సెలవులు
ఈ నెలలో మీకు ఏమైనా బ్యాంకులో పెండింగ్ పనులు ఉన్నాయా? అయితే వాటిని వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ నెల చివరి నుండి వచ్చే వారం 4వ తారీఖు వరకు బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పని చేస్తాయి. ఈ సమయంలో బ్యాంకులో పనులు చేసుకోవాలని ఎవరైనా భావిస్తే ముందే పూర్తి చేసుకోవడం మంచిది. మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. మీ బ్యాంకు పనులు ముగించుకోవడానికి మీ ముందున్న ఆప్షన్స్.. ఈ వారంలోనే పనులు ముగించుకోవడం లేదా 4వ తేదీ వరకు వేచి ఉండటం. ఈ కాలంలో తెరిచి ఉండే రెండు రోజుల్లో పనులు పూర్తి కాకపోవచ్చు.
ఎనిమిది పండుగ సెలవులు ఇక, ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెలలో బ్యాంకులు పద్నాలుగు రోజులు క్లోజ్ అవుతాయి. ఎనిమిది రోజులు వివిధ పండుగల సెలవులు. ఏప్రిల్ ఒకటిన బ్యాంక్ క్లోజింగ్ డే. నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు మూసివేసి ఉంటాయి.
ఏప్రిల్ నెలలో సెలవులు ఇలా ఏప్రిల్ 1న క్లోజింగ్ డే. 2న గుడ్ ఫ్రైడే, 4న ఆదివారం, 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, 10న రెండోశనివారం, 11న ఆదివారం, 13న గుడి పడ్వా/ఉగాది, 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి /తమిళ సంవత్సరాది, 15న హిమాచల్ డే/బెంగాల్ సంవత్సరాది, 16న బొహాగ్ బిహు (అసోంలో సెలవు), 18న ఆదివారం, 21న శ్రీరామనవమి, 24న నాలుగో శనివారం, 25న ఆదివారం. బ్యాంకులకు అధికారిక సెలవులు ఉన్న రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో పని దినాలుగా ఉన్నాయి.
సెలవులు..
- 27 మార్చి 2021 – నాలుగో శనివారం
- 26 మార్చి 2021 – ఆదివారం
- 29 మార్చి 2021- హోలీ
- 30 మార్చి 2021- హోలీ సందర్భంగా పాట్నాలో సెలవు
- 31 మార్చి 2021 – ఆర్థిక సంవత్సరం చివరి రోజు
- 1 ఏప్రిల్ 2021 – బ్యాంకు అకౌంటింగ్
- 2 ఏప్రిల్ 2021- గుడ్ ఫ్రైడే
- 3 ఏప్రిల్ 2021 – బ్యాంకులు తెరిచి ఉంటాయి
- 4 ఏప్రిల్ 2021 – ఆదివారం