తెలంగాణకు వర్షాలు…ఆదివారం పలచోట్ల వర్షాలు పడే అవకాశం

0
rain-in-achampet

తెలంగాణకు వర్షాలు…ఆదివారం పలచోట్ల వర్షాలు పడే అవకాశం

తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. గత కొన్నిరోజులుగా పలు చోట్ల వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. అయితే ఇవాళ కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈశాన్య బీహార్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, ఉత్తర కేరళ మీదుగా అరేబియా సముద్రం వరకు వీస్తున్న పశ్చిమగాలులతో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ తెలిపింది.rain fall in achampet

rain-in-achampet

ప్రధానాంశాలు:

బలహీన పడ్డ అల్పపీడన ద్రోణి

ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

ఆదివారం పలచోట్ల వర్షాలు పడే అవకాశం

మరోవైపు ఆదివారం రాష్ట్రంలోని ఒకటి రెండుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనావేసింది. శనివారం అత్యల్పంగా ఆదిలాబాద్‌ జిల్లా అర్లి (టీ)లో 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆది, సోమవారాల్లో పొడి వాతావరణం నెలకొనే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో అకాల వర్షాలకు అల్పపీడన ద్రోణి కారణమని చెప్పారు. నేడు అల్పపీడన ద్రోణి ప్రభావం బలహీనపడుతుందని పేర్కొన్నారు.rain fall in achampet

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *