ఏప్రిల్ 8 హనుమాన్ జయంతి

ఏప్రిల్ 8 హనుమాన్ జయంతి.
Hanuman Jayanti Achampet హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. ఈశ్వరుని అంశ, వాయుదేవుని ఔరస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునునికి ప్రియ సఖుడు.. శ్రీరామ దాసుడు. ఎర్రని కన్నులుగల వానరుడు. అమిత విక్రముడు. శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మ శోకాన్ని హరించినవాడు. ఔషధీ సమేతంగా ద్రోణాచలాన్ని మోసుకొచ్చి యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణనుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు ప్రయాణం, నిద్రపోయే ముందు స్మరించినవారికి మృత్యుభయం ఉండదు. hanuman jayanti achampet వారికి సర్వత్ర విజయం లభిస్తుంది.
ధైర్యం, శక్తి సామర్ధ్యాలకు హనుమత్ రూపం ప్రతీకం. ఆకాశ మార్గాన ప్రయాణించి సముద్రం దాటి లంకలోకి ప్రవేశించి సీతమ్మ జాడ కనిపెట్టారు. సంజీవని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తి యుక్తులను కీర్తించడం ఎవరి తరం కాదు. హనుమాన్ జయంతిని కొందరు చైత్ర పౌర్ణమి నాడు, మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుతారు. కేరళలో మార్గశిర మాసంలో హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు.
అతిబల పరాక్రమవంతుడైనా శ్రీరాముని సేవలో గడపడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. తన మనసునే మందిరంగా చేసి శ్రీరాముని ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారంటే సీతమ్మ తల్లికంటె మిన్నగా రాముని ప్రేమించాడు. ఒకసారి సీతమ్మ నుదుటున సిందూరం చూసి ఎందుకు పెట్టుకున్నవు తల్లీ? అని అడిగితే, శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెబుతుంది. అంతే హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి.
ఇది పాత చిత్రం 2019
Hanuman Jayanti Achampet
achampet అచ్చంపేట లో ప్రతి ఏప్రిల్ 8 న హనుమాన్ జయంతి ఉత్సవాలు అచ్చంపేట ప్రజలు అందరు కలిసి జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం కరోన మహమ్మారి విజృంభింస్తునందు వల్ల ఈ సంవత్సరం ఉత్సవాలు జరుపుకోవడం లేదు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube
| Linkedin