చాకలి ఐలమ్మ 35 వ వర్ధంతి.

చాకలి ఐలమ్మ 35 వ వర్ధంతి.
చిట్యాల ఐలమ్మ (సెప్టెంబరు 26, 1895 – సెప్టెంబర్ 10, 1985) చాకలి ఐలమ్మ గా గుర్తింపు పొందిన తెలంగాణా వీరవనిత. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి.
వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. chakali ilamma telangana poratam
అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు.
దొరల వ్యవస్థను మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. chakali ilamma telangana poratam
మరణం:
ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనాన్ని సిపిఎం పార్టీ వారు నిర్మించారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అఢ్యక్షులు పోకల మనోహర్ అన్న గారు, మరియు అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ శ్రీ తులసీరామ్ గారు, కౌన్సెల్ర్ నిర్మల బాలరాజు, గారు, లింగం గారు, మల్లేష్ గారు మరియు రజక సంగం నాయకులూ పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin