సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది…
సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది…
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఇండియన్ మ్యూజిక్ హిస్టారిలో ఘంటసాల తరువాత ఆ స్థాయిలో సంగీత ప్రియులకు ఎంతగానో ఆకట్టుకున్న గాయకుడు SP. బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎలాంటి పాట పాడినా కూడా అందులో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. SP Balasubrahmanyam Passes Away
చాలామంది గాయకుల్లాగా పాటల్ని బాగా ప్రాక్టీస్ చేసి పాడడం బాలుకు అలవాటు లేదు. స్వరజ్ఞానం బాగా ఉండడం వల్ల సంగీత దర్శకుడు ఒకసారి చెప్పగానే ఇట్టే దాంట్లోని మెళకువల్ని గమనించి పాడేసేవారు. అలా రోజుకు పది గంటల సేపు రకరకాల భాషల్లో పాడుతుండేవారు. అసలు అలా పాడడమే తనకు ప్రాక్టీసేమో అని కూడా అనేవారు. పాటల్ని సాధన చేయడం గురించి ఒకసారి అడిగితే.. ‘‘గాయకుడిగా నేను ఏనాడూ ప్రాక్టీస్ చేసింది కూడా లేదు. కష్టమైన శంకరా భరణం లాంటి క్లాసికల్ పాటలు అయితే రెండ్రోజుల ముందు ఆఫీసులో రిహార్సల్ చేసేవాళ్లం. పాటపాడాల్సిన రోజు 5 గంటలకు లేచి ఓ రెండు గంటలు ప్రాక్టీస్ చేసి రికార్డింగ్‌కి వెళ్లేవాణ్నంతే. మొత్తమ్మీద ఈ 50 సంవత్సరాల్లో మొత్తం 45 సంవత్సరాలు రోజుకు 10 గంటలు నేను పాడుతూనే ఉన్నా. ఆ పాడ్డమే నాకు ప్రాక్టీస్ అయ్యిందేమో. గాయనీగాయకులంతా ఒక నిబద్ధతతో ఉంటారు. చల్లటి నీళ్లు తాగకూడదు, పెరుగు తినకూడదు..లాంటివి. నేను ప్రొఫెషన్‌కు ఎంత మర్యాదిస్తానో జీవితాన్ని అంత ప్రేమిస్తాను. అందుకే సాధారణ సగటు మనిషిలాగానే ఉండేవాడిని. 20 సంవత్సరాలపాటు సిగిరెట్ తాగాను. ఆ తర్వాత మానేశాననుకోండి. సిగరెట్ తాగడం అస్సలు మంచిది కాదు. గాయకులకు అసలే మంచిది కాదు. అయినా నా గొంతు అలా ఎందుకు ఉందో నేను చెప్పలేను.’’ అని చెప్పారు. SP Balasubrahmanyam Passes Away
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin