పరిమిషన్ దగ్గుమందుకు… కరోనా కు కాదు!..
కరోనా చికిత్సకు తెచ్చిన కరోనిల్, స్వాసరి మందులపై ఇస్తున్న వాణిజ్య ప్రకటనలను వెంటనే నిలిపేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలి సంస్థను బుధవారం ఆదేశించింది. ఇటీవల మందుల తయారీ, మార్కెటింగ్ గురించి సంస్థ పెట్టుకున్న అప్లికేషన్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, పతంజలి ఆ అప్లికేషన్ లో కరోనా మందు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ‘పతంజలి అప్లికేషన్ ప్రకారం రోగ నిరోధక శక్తి, దగ్గు, జ్వరానికి మందు తయారు చేస్తామని పేర్కొన్నారు. వాళ్లకు కోవిడ్–19 కిట్ ను తయారు చేసే అనుమతి ఎలా వచ్చిందో నోటీసులు పంపి తెలుసుకుంటాం’ అని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద డిపార్టు మెంట్ లైసెన్సింగ్ ఆఫీసర్ వెల్లడించారు. patanjali medicine for corona
జైపూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎన్ఐఎంఎస్)తో కలిసి కరోనా చికిత్సకు మందులు కనుగొన్నట్లు పతంజలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థను ప్రమోట్ చేస్తున్న రామ్ దేవ్ బాబా స్వయంగా తానే రెండు మందులను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. కరోనిల్, స్వాసరి మందులను ఢిల్లీ, అహ్మదాబాద్, మీరట్ లలో క్లినికల్ ట్రయల్స్ కూడా చేశామని పతంజలి చెప్పింది.
కరోనాకు ఆయుర్వేద మందు తీసుకొచ్చినట్టు పతంజలి ఆయుర్వేద్ సంస్థ ప్రకటించిన రోజే ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి తీవ్ర స్పందన ఎదురైంది. ‘కొరోనిల్, స్వసరి’ మందును శాస్త్రీయంగా పరిశీలించి ఆమోదించేవరకు ఎలాంటి ప్రకటనలు చేయవద్దని ఆదేశించింది. ‘కొరోనిల్, స్వసరి’ పేరిట పతంజలి ఆయుర్వేద్ సంస్థ రెండు రకాల ఔషధాలు ఉన్న కిట్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ మందులతో 7 రోజుల్లో కరోనా పూర్తిగా నయమవుతుందని పతంజలి సహ వ్యవస్థాపకులు రామ్‌దేవ్ బాబా చెబుతున్నారు.
patanjali medicine for corona
ఈ నేపథ్యంలో ఈ ఔషధానికి ఎలా అనుమతి ఇచ్చారన్న దానిపై విచారణ మొదలైంది. దీనిపై ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆయుర్వేదశాఖ అధికారులను వివరణ కోరగా, ‘కొరోనిల్’ కోసం పతంజలి సంస్థ దరఖాస్తు చేసుకున్న సమయంలో ‘కరోనా వైరస్’ పేరును ప్రస్తావించలేదని తెలిపింది. రోగ నిరోధకశక్తి పెంపొందడానికి, దగ్గు, జ్వరం నియంత్రణకు మాత్రమే తాము ఆ మందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ‘దీనిపై పతంజలి సంస్థను వివరణ కోరతాం. నోటీసులు జారీ చేస్తాం. కొవిడ్-19 కిట్‌కు ఎలా అనుమతి లభించిందో విచారణ జరుపుతాం’ అని లైసెన్స్ అధికారి పేర్కొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin