మహాత్మా జ్యోతిబా ఫూలే 193 వ జయంతి
నగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఎమ్యెల్యే ప్రభుత్వ విప్ శ్రీ గువ్వల బాలరాజు గారు ఈ రోజు క్యామ్ప్ ఆఫీస్ లో శ్రీ మహాత్మా జ్యోతిబా పూలె గారి 193 వ జయంతి ని పురస్కరించుకొని వారికీ ఫోటోకి నివాళులు అర్పించారు. mahatma jyotiba phule
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషిచేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు.
mahatma jyotiba phule
‘కులవివక్ష’కు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తత్తవేత్త
సామాజిక తత్వవేత్త, ఉద్యమకా రుడు, సంఘసేవకుడైన ఫూలే.. దేశంలో కులవివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన ‘‘మనుస్మృతి’’ని తిరస్కరించి, మహిళలకు అండగా నిలిచాడు. వారిక్కూడా సమాజంలో పురుషుల్లాగే స్వేచ్ఛగా జీవించే హక్కువుందని పేర్కొన్న ఆయన.. స్త్రీల విద్యకోసం ఎంతగానో పాటుపడ్డాడు. అలాగే ఆనాడు వున్న బానిసత్వపు సంస్కృతీని పూర్తిగా తరిమికొట్టాలనే ఉద్దేశంతో తనవంతు కృషి చేశాడు. మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు.
1827 ఏప్రిల్ 11న మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో యాదవ కులానికి చెందిన కుటుంబంలో జోతిరావ్ ఫూలే జన్మించాడు. తల్లి ఇతనికి 9 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు కానీ.. కాలక్రమేణా పూలవ్యాపారం చేయడంవల్ల వారి ఇంటిపేరు ‘ఫూలే’గా మార్పు చెందింది. 7 ఏళ్ల వయస్సున్నప్పుడు ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. అయితే కుటుంబ పరిస్థితులు సరిగ్గాలేనందుకు వెంటనే చదువు మానేసి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. ఈయనకు 13 ఏళ్ల వయసులోనే సావిత్రి ఫులేతో వివాహం జరిగింది. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువగా వుండేది. అయితే ఆయనకు చదువుపట్ల వున్న ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్.. ఇంటి ప్రక్కనే వుండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జ్యోతిరావ్ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin