ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 193వ జయంతి కార్యక్రమం
ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 193వ జయంతి కార్యక్రమం
Achampet వెల్టూర్(ఉప్పునుంతల):బహుజన మేధావి,సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే గారి నేడు 193వ జయంతి సందర్భంగా గ్రామంలోని స్థానిక అంబేద్కర్ కార్యాలయం ముందు ఘనంగా నిర్వహించడం జరిగింది. Mahatma Gandhi Jyotiba Phule
ఈ సందర్భంగా మహనీయుని చిత్ర పటానికి పూలమాలతో నివాళులర్పించి వారు చేసిన సేవలు గుర్తు చేసుకొని కొనియాడారు..
‘కులవివక్ష’కు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ తత్తవేత్త
ప్రస్తుత భారతదేశంలో కులవివక్ష ప్రభావం అంతగా లేదుగానీ.. 19,20వ శతాబ్దకాలాల్లో చాలా ఎక్కువగానే వుండేది. ఆనాడు కాలాల్లో కులంపేరుతో ఎంతోమంది బడుగు – బలహీనవర్గాలు ప్రజలు ఎన్నోరకాలుగా అణిచివేతకు గురయ్యేవారు. సమజాంలో ఇతరుల్లాగా వారికి సమానహక్కులు వుండేవికావు. ఇటువంటి కులవివక్ష సంస్కృతీ భారతదేశంలో మరింతగా పెరిగిపోతున్న సందర్భంలో కొందరు మహనీయులు అందుకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. సమాజంలో ప్రతిఒక్కరికీ సమానహక్కులు వుండాల్సిందేనంటూ ఎంతోమంది గళం విప్పారు. కులపేరుతో తరతరాలుగా అణిచివేయబడుతున్న బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి కృషి చేశారు. అటువంటివారిలో ‘జ్యోతిరావ్ ఫులే’ ఒకరు.
Mahatma Gandhi Jyotiba Phule
సామాజిక తత్వవేత్త, ఉద్యమకా రుడు, సంఘసేవకుడైన ఫూలే.. దేశంలో కులవివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసం పోరాడాడు. స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన ‘‘మనుస్మృతి’’ని తిరస్కరించి, మహిళలకు అండగా నిలిచాడు. వారిక్కూడా సమాజంలో పురుషుల్లాగే స్వేచ్ఛగా జీవించే హక్కువుందని పేర్కొన్న ఆయన.. స్త్రీల విద్యకోసం ఎంతగానో పాటుపడ్డాడు. అలాగే ఆనాడు వున్న బానిసత్వపు సంస్కృతీని పూర్తిగా తరిమికొట్టాలనే ఉద్దేశంతో తనవంతు కృషి చేశాడు. మానసిక బానిసత్వం నుండి శూద్రులను కాపాడాలని త్రితీయ రత్న అనే నాటకాన్ని రచించాడు. సమాజంలో పాతుకుపోయిన ఆచారాలను, మూఢ నమ్మకాలను ఖండించాడు.
కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అద్యక్షులు ఉప్పరి బాలరాజు,బహుజన నాయకులు బూషిరాజ్ మల్లయ్య,లింగమయ్య,వెంకట్ రెడ్డి,నిరంజన్,వెంకటయ్య,నర్సోజి మరియు కమిటీ ఉపాధ్యక్షులు సైదులు,శ్రీను,ప్రధాన కార్యదర్శి గుద్దటి బాలరాజు,కోశాధికారి శ్రీను,ప్రచార కార్యదర్శి శ్రీధర్,కార్యదర్శిలు అశోక్,ప్రహ్లాద్,సలహాదారులు,రాజమౌళి,జనార్ధన్,భరత్,శ్రీకాంత్,శ్రీను,వెంకటేష్,మల్లేష్,మస్తాన్,నాగేష్,భాస్కర్,రమేష్,కృష్ణ,బాలరాజు,కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు!
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin