• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ఇక ఆన్‌లైన్‌ పాలన..!

Share Button

ఇక ఆన్‌లైన్‌ పాలన..!

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ పాలన అమల్లోకి రాబోతోంది. ఎలక్ట్రానిక్‌ కార్యాలయం (ఇ-ఆఫీస్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌లో సులభతర పరిపాలన చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నుంచే ఈ విధానం అమలుకానుంది. దీని నిర్వహణకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయడంతో పాటు ఉద్యోగుల డిజిటల్‌ సంతకాలు సేకరించాలని వివిధ శాఖలకు ప్రభుత్వం అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది. e-offices in telangana

e-0nline-office-in-telangana

కరోనా నేపథ్యంలో దస్త్రాల నిర్వహణ భౌతికంగా జరగడం ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ‘‘ఈ-కార్యాలయం ద్వారా కరోనా వ్యాప్తి భయం ఉండదు. దస్త్రాల నిర్వహణ సులభతరమవుతుంది. పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతాయి’’ అని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తొలుత రెవెన్యూ, విపత్తు నిర్వహణ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, దేవాదాయ శాఖల్లో ఈ ఆఫీస్‌ ప్రక్రియను ప్రవేశ పెట్టనున్నారు. ఈ-కార్యాలయాన్ని త్వరలోనే అన్ని శాఖల్లో అమలుచేసి, అధికారులు, సిబ్బంది ఇంట్లో ఉన్నా పనయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

ఈ ఏర్పాట్లు చేయాలి
e-offices in telangana

ఇ-కార్యాలయం నిర్వహణకు ప్రతి శాఖకు ఒక నోడల్‌ అధికారిని, సాంకేతిక సహాయకుడిని నియమించాలని ప్రభుత్వం తెలిపింది. మంగళవారంలోగా అవసరమైన సరంజామా సమకూర్చుకోవడంతో పాటు ఉద్యోగుల మస్తర్‌ డేటాబేస్‌, అధికారిక మ్యాపింగ్‌, యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వంటి వివరాలను, ఈ ముద్ర అప్లికేషన్‌ ద్వారా వారి డిజిటల్‌ సంతకాలను సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలని ఆయా శాఖలకు సూచించింది. ఈ నెల 8వ తేదీలోగా దస్త్రాల డిజిటలైజేషన్‌, 9వ తేదీలోగా ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేయనుంది. డిజిటల్‌ ప్రక్రియ ద్వారా పరిపాలన కొనసాగాలంటే ప్రతి సెక్షన్‌కు కనీసం ఒక స్కానర్‌ అవసరమవుతుంది. ఒకచోట స్కాన్‌ చేసి ఫైల్‌ను అప్‌లోడ్‌ చేస్తే అది డిజిటల్‌ ఫైల్‌ రూపంలో ప్రతి సిస్టంలో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ కోసం ప్రతి అధికారి దగ్గర 4 జీబీ ర్యామ్‌ అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న డెస్క్‌టాప్‌ సిస్టం అవసరమవుతుంది.

ఎన్‌ఐసీ ద్వారా రూపకల్పన

ఈ-కార్యాలయం సాఫ్ట్‌వేర్‌ను డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌’(ఎన్‌ఐసీ) రూపొందించింది. ఉద్యోగి తన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌తో ఈ- కార్యాలయంలోకి ప్రవేశించి డిజిటల్‌ దస్త్రాల సృష్టి, నిర్వహణతో పాటు అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించవచ్చు. ప్రతి అధికారికి ప్రత్యేకంగా డిజిటల్‌కీ అందుబాటులో ఉంటుంది. ఐటీ శాఖ సహకారంతో ఎస్‌ఓ నుంచి ఆ పైస్థాయి అధికారుల వరకు వివిధ స్థాయిల్లో మ్యాపింగ్‌ చేస్తున్నారు.

పారదర్శకంగా

ఈ విధానంలో దస్త్రాల కదలిక నిరంతరం తెలిసే సౌలభ్యం ఉంది. నిర్దిష్ట సమయంలో దస్త్రం ఏ అధికారి దగ్గర ఉంది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది? తదితర వివరాలను తెలుసుకోవచ్చు. దస్త్రాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు తమ మొబైల్‌, లేదా ఈమెయిల్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat