తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం.. పెరుగుతోన్న మృతుల సంఖ్య…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం.. పెరుగుతోన్న మృతుల సంఖ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పలు కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్ డౌన్ పొడిగించాయి ప్రభుత్వాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం 1062 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే నిన్న ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. Covid cases in telangana-Ap
ఇక కోవిడ్ వల్ల కర్నూలులో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, గుంటూరులో ఒకరు, వైజాగ్‌లో ఒకరు మరణించారు. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 22259కి చేరింది. అలాగే ఇప్పటివరకూ 264 మంది మృతి చెందారు. ప్రస్తుతం 10,894 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 11,101 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో 27,643 శాంపిల్స్‌ను పరీక్షించగా 1051 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఏపీలో మొత్తం ఇప్పటివరకూ 10,77,733 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. Covid cases in telangana-Ap
ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. రోజు వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం నిర్దారించిన వాటితో కలిపి మొత్తం కేసులు 30 వేలకు చేరువయ్యాయి. నిన్న 1,924 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో అధికారులు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 29,536కు చేరుకుంది. ఇక ప్రజంట్ తెలంగాణలో యాక్టివ్ కేసులు 11,933గా ఉన్నాయి.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin