• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

డి-విటమిన్‌ తక్కువగా ఉన్న వారికీ కరోనా …

Share Button

డి-విటమిన్‌ తక్కువగా ఉన్న వారికీ కరోనా …

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయితే.. డి-విటమిన్‌ లోపం ఉన్నవారే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని, మృతుల్లోనూ వారే అధికమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. సమృద్ధిగా డి-విటమిన్‌ ఉన్న వారికి కరోనా వచ్చినా.. త్వరగానే కోలుకుంటున్నట్లు తేలింది. నగరవాసుల్లో సుమారు 80 శాతం మందిలో డి-విటమిన్‌ లోపం ఉంటుందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. vitamin d deficiency causes

new-vitamin-d

 

కాగా.. గ్రేటర్‌ వాసులే ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం గమనార్హం. డి-విటమిన్‌ తక్కువగా ఉన్న వారిలో రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుందని హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు. కరోనా మృతుల్లో అధిక శాతం వారేనని, డి-విటమిన్ సమృద్ధిగా ఉన్న వారు త్వరగా కోలుకుంటున్నారని ఆయన చెప్పారు.

విటమిన్ డి అధికంగా ఉండే 11 ఆహారపదార్థాలు

విటమిన్ డి ఒక కొవ్వులో కరిగే విటమిన్, ఇది మిగతా విటమిన్లకన్నా వేరైనది ఎందుకంటే సూర్యకాంతి పడ్డప్పుడు మనిషి శరీరం దీన్ని ఎక్కువ పీల్చుకోగలదు. విటమిన్ డి ఒక విటమిన్ కన్నా హార్మోన్ ముందు కారకంలాగా ఎక్కువ పనిచేస్తుంది, అందుకే హార్మోన్ అసమతుల్యత మరియు శరీరంలో రోగనిరోధకతపై ప్రభావం చూపించగలదు. విటమిన్ డి శరీరం ఎముకలకి కాల్షియం పీల్చుకోవటంలో పెద్ద పాత్ర పోషిస్తుంది మరియు విటమిన్ డి లోపం వలన ఎముకలు మెత్తబడి ఆస్టియోమలేసియా అనే వ్యాధి లేదా ఎముకలు అసాధారణంగా మారే స్థితి రికెట్’స్ కో దారితీస్తుంది. విటమిన్ డి లోపం లక్షణాలు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, రుతువుతో తగ్గి పెరిగే డిప్రెషన్, ఆటోఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్, బలహీనమైన ఎముకలు, చర్మ సమస్యలు మరియు డిమెన్షియా వంటివి రావచ్చు.

తక్కువ సూర్యకాంతి లేదా అసలు తమ శరీరాలను ఎండ తగలనివ్వని వాళ్లకి కూడా విటమిన్ లోపం రావచ్చు. మీకు సరిగా సూర్యకాంతి తగలకపోతున్నట్లయితే, ఇక్కడ ఇచ్చిన 11 ఆహారపదార్థాలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది, వాటిని మీ రోజువారీ భోజనంలో జతచేసుకోండి. vitamin d deficiency causes

1. చేపలు:

చేపలలో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు ఎక్కువ ఉంటాయి, మాకెరెల్, సాల్మన్ మరియు ట్యూనా చేపలలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల సాల్మన్ మరియు మాక్రెల్ లో రోజుకి సరిపోయే దాంట్లో 91 శాతం విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి మాత్రమే కాక, చేపలో ఇతర పోషకాలు కూడా ఉంటాయి.
fish

2. పుట్టగొడుగులు:

పుట్టగొడుగులు విటమిన్ డి ఎక్కువగా ఉండే మంచి ఆహారపదార్థం. అవి పెరిగేటప్పుడు ఎండలో ఎక్కువగా ఉంటాయి, అందుకనే వాటిలో విటమిన్ డి విలువ ఎక్కువగా ఉంటుంది. బటన్ మష్రూమ్స్ చాలా సాధారణంగా విటమిన్ డి ఎక్కువగా ఉండే పుట్టగొడుగులు.

mushrooms

3. పాలు:

ప్యాకింగ్ లో వచ్చే పాలు లేదా పచ్చి ఆర్గానిక్ పాలలో విటమిన్ డి తో నిండేట్లా ప్రాసెస్ చేస్తారు. సంపూర్ణమైన పాలను ఎక్కువగా తాగుతూ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండండి. ఒక కప్పు పచ్చి పాలల్లో రోజువారీ సూచించిన విటమిన్ డి లో 24 శాతం వరకూ ఉంటుంది.

glass-of-milk-pouring

4. కాడ్ లివర్ ఆయిల్:

కాడ్ లివర్ ఆయిల్ మీ రోజువారీ సూచించిన విటమిన్ డిని పొందటానికి ఒక మంచి మరియు సులభమైన పద్ధతి. కాడ్ లివర్ ఆయిల్, కాడ్ చేపలోని కాలేయం నుంచి తీయబడుతుంది. ఇది సాధారణంగా క్యాప్సూల్స్ రూపంలో లభిస్తుంది. 1 చెంచా కాడ్ లివర్ ఆయిల్ లో రోజువారీ సూచించిన విటమిన్ డి 100 శాతం లభిస్తుంది.

cod-liver-oil-capsules

5. ఛీజ్:

రికొట్టా ఛీజ్, స్విస్ ఛీజ్, మరియు గోట్ ఛీజ్ ఇవన్నీ విటమిన్ డి కి మంచి వనరులు. మీ ఆహారంలో ఒక ముక్క వీటి యొక్క జున్నును జతచేసుకోవటం వలన విటమిన్ డి లోపం వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఛీజ్ ను మీ శాండ్ విచ్ కి జతచేయండి లేదా మీ ఆహారంపై అలా చల్లుకోండి.

maxresdefault-cheese

6. గుడ్లు:

గుడ్లు కూడా విటమిన్ డి ని ఇచ్చే మంచి ఆహారపదార్థాలు. నిజానికి గుడ్లు శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలను అందిస్తాయి. 1 పెద్ద గుడ్డు రోజువారీ సూచించిన విటమిన్ డి లో 10 శాతాన్ని అందిస్తుంది. గుడ్లలో ఇతర విటమిన్లు ఎ, కె, మరియు ఇ కూడా ఉంటాయి.

eggs

7. కమలాపళ్ళు:

ఒక గ్లాసు ఆరెంజి రసం కూడా చాలా విటమిన్ డి మరియు కాల్షియం అందిస్తుంది. రోజూ బ్రేక్ ఫాస్ట్ లో కమలాపండ్లను తినటం వలన విటమిన్ డి లోపం వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఒక కప్పు ఆరెంజి రసం 36 శాతం విటమిన్ డి ని అందిస్తుంది.

fresh-orange

8. రొయ్యలు:

రొయ్యలలో అధికంగా ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు మరియు విటమిన్ డి ఉంటాయి, ఇవి వాపులు తగ్గించేటప్పుడు మరియు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గేటప్పుడు మీ ఎముకలకు చాలా మంచిది. 3 ఔన్సుల రొయ్యలు 2ఐయూ ల విటమిన్ డి అందిస్తుంది మరియు ఇందులో విటమిన్ బి12, ఇ కూడా పుష్కలంగా ఉంటాయి.
royyalu

9. పెరుగు:

పెరుగులో కూడా విటమిన్ డి ప్రాసెస్ చేయబడి, ప్యాకయి వస్తోంది. ఇది శరీరం కాల్షియం ఎక్కువ పీల్చుకునేలా చేస్తుంది. ఒక కప్పు పెరుగు రోజువారీ విటమిన్ డిలో 20 శాతాన్ని అందిస్తుంది. పెరుగు మీరు యవ్వనంగా, ఆరోగ్యంగా ఎక్కువకాలం ఉండేలా కూడా చేసే ఒక మేటి పదార్థం.

Making-curd

Follow us on Social Media :

Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat