కరోనా మరణాలను నిరోధిద్దాం

0
kct-telangana-cm

corona cases telangana

కరోనా మరణాలను నిరోధిద్దాం

corona cases telangana, corona in achampet, hospitals in achampet, isolation wards in achanpet

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరిగినా వీలైనంత మేరకు మరణాలు సంభవించకుండా నిరోధించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు. నిరంతర పర్యవేక్షణతో వైద్యసేవలు అందించాలని సూచించారు. శనివారం కరోనాపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో ఆయన మాట్లాడారు. శనివారం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగినా మరణాల సంఖ్య పెరగలేదని, మున్ముందు మరణాలను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ‘‘దిల్లీ నుంచి వచ్చిన వారందరికీ వైద్యపరీక్షలు పూర్తి చేయాలి. అన్ని జిల్లాల్లోనూ క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ కేంద్రాలు అందుబాటులో ఉన్నందున పరీక్షలలో జాప్యం జరగకూడదు. వైద్య సేవలపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎక్కడా నిర్లక్ష్యం చూపరాదు. పరికరాలు, ఔషధాల కొనుగోలుకు విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడా సమస్యలు రాకుండా వ్యవహరించాలి. గడువు మేరకు లాక్‌డౌన్‌, రాత్రి పూట కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలి’’ అని సీఎం సూచించారు.

corona positive cases in telangana
కరోనాపై పోరుకు ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రగతిభవన్‌లో దీపాలు వెలిగించే కార్యక్రమం జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌, కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ బల్బులను ఆర్పి దీపాలను వెలిగించనున్నారు. కరోనా నిర్మూలనకు సంఘీభావ సంకేతంగా
to check more updates about corona cases and information all over india తెలంగాణ ప్రజలంతా దీపాలు వెలిగించాలని, ఐక్యతను చాటుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం కోరారు. ప్రభుత్వపరంగానూ దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనాలని అధిష్ఠానం సూచించింది.

login on to our facebook page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *