తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Telangana Elections Counting) ప్రారంభమైంది.
ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగనుంది. తెల్లవారుజామున 5 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు మొదట పోస్టల్, సర్వీస్ ఓట్లను అధికారులు లెక్కించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఓట్ల లెక్కింపు కోసం 119 స్థానాల్లో 1,798 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తం మొత్తం లక్షా 80 వేల పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సిద్ధం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ జరుగనుంది.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin