• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ప్రైడో పేరిట క్యాబ్‌ అగ్రిగేటర్‌ ప్రారంభం

Share Button

రద్దీ సమయాల్లో ఎలాంటి అదనపు రుసుమూ లేకుండా అద్దె కార్ల సేవలను అందించనున్నట్లు హైదరాబాద్‌కు చెందిన అంకురం వెంకట ప్రణీత్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ప్రణీత్‌ గ్రూప్‌ నుంచి ప్రైడో పేరిట క్యాబ్‌ అగ్రిగేటర్‌ సేవలను ఈ నెల 29 నుంచి ప్రారంభించబోతున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 14,000 మంది డ్రైవర్లను భాగస్వాములుగా చేర్చుకొని, ప్రయోగాత్మకంగా క్యాబ్‌ సేవలను అందిస్తున్నామని ప్రైడో వ్యవస్థాపకుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నరేంద్ర కామరాజు గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు.

హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్‌, ఎస్‌యూవీల విభాగంలో క్యాబ్‌లను అందించనున్నట్లు చెప్పారు. విస్తరణపై రూ.100 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. తెలంగాణ ప్రభుత్వ హాక్‌-ఐతో ప్రైడో యాప్‌ను మిళితం చేశామనీ, డ్రైవర్లకు సంబంధించి అన్ని వివరాలనూ స్వయంగా పరిశీలించాకే వారిని భాగస్వాములుగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డ్రైవర్ల దగ్గర్నుంచి 10 శాతం లోపే కమిషన్‌ వసూలు చేస్తామని, వారికి మరింత ఆదాయం లభించేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు.

వారం, నెల ముందుగానూ క్యాబ్‌లను బుకింగ్‌ చేసుకోవచ్చని, ప్రత్యేక సందర్భాల్లో బల్క్‌ బుకింగ్‌కూ అవకాశం ఉందన్నారు. దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఖాళీగా తిరిగి వచ్చే డ్రైవర్లకు నష్టం రాకుండా రిటర్న్‌ కాంపన్సేషన్‌, ప్రయాణికులు దగ్గర్లో క్యాబ్‌లు అందుబాటులో లేకపోతే దూరం నుంచైనా వాటిని రప్పించుకోవడంలాంటివీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat