తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం.
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం.
అచ్చంపేట నియోజకవర్గ స్థాయి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సమావేశం అచ్చంపేట టీఎన్జీవో భవనంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు బి. ఆంజనేయులు హాజరై ప్రసంగించారు. ఆశ వర్కర్స్ ప్రాథమిక స్థాయిలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో వారి సేవలు అమోఘమైనవని కొనియాడిన టిఆర్ఎస్ ప్రభుత్వం వారు కడుపునిండా మూడు పూటలు తినడానికి మాత్రం జీతం పెంచలేదని అన్నారు. వారు 15 రోజులు సమ్మె చేసిన ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోవడం వల్ల వారి ప్రతాపం ఓట్లల్లో కనబడిందని, అచ్చంపేట మెజార్టీ చూస్తే అర్థమవుతుందన్నారు. తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంపై గంపెడు ఆశ తో ఎదురుచూస్తున్న ఆశ వర్కర్లు వారు సమస్యలు పరిష్కారం అవుతాయని, పాత బకాయిలన్నీ చెల్లించాలని ఆశిస్తున్నామన్నారు. ఏదేమైనా ఆశ వర్కర్లందరూ ఒకతాటి…
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin