మహిళలకు TSRTC బిగ్ అలర్ట్.. ఇకపై బస్సులో ప్రయాణించాలంటే తప్పక అవి ఉండాల్సిందే..!

0
TRC MD Sajjanar
Share

TRC MD Sajjanar

మహిళలకు TSRTC బిగ్ అలర్ట్.. ఇకపై బస్సులో ప్రయాణించాలంటే తప్పక అవి ఉండాల్సిందే..!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో భాగంగా శుక్రవారం నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్‌ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం ఆయన వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన మహాలక్ష్మి స్కీమ్‌కు మహిళ నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను సంస్థ అప్ డేట్ చేసిందన్నారు. ఆ సాప్ట్ వేర్‌ను టిమ్ మెషిన్లలో ఇన్ స్టాల్ చేయడం జరుగుతోందన్నారు. మెషిన్ల ద్వారా శుక్రవారం నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందన్నారు. మహిళా ప్రయాణికులకు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని కోరారు. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి.. విధిగా జీరో టికెట్లను తీసుకోవాలన్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలని కోరారు.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *