మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం మంచిదే కానీ..
తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం మంచిదే కానీ ఉచితమని చెప్పేసరికి కార్తీక మాసం చివరి రోజులు కాబట్టి అందరూ శ్రీశైలం యాత్రకు వచ్చారు అక్కడ దర్శనం చేసుకుని మళ్లీ వారి ఊర్లకు తిరిగి వెళ్లడానికి బస్సులు ఉన్నాయి మొత్తం ఆంధ్రవి కాబట్టి తెలంగాణ వాళ్లు వెళ్లడానికి నానారకాలుగా ఇబ్బందులు పడ్డారు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు రెండు బస్సులు వేశారు ఐదు ఆరు బస్సుల మందికి రెండు బస్సులు వేస్తే సరిపోతుందా ఉచితం పేరుతో శ్రీశైలం వెళ్లే యాత్రికులను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మూడు నాలుగు గంటలకు ఒక బస్సు వేస్తే ఎలాగని ప్రయాణికులు మహిళలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఉచితం పేరుతో ఇబ్బందులు పెడితే మీకు న్యాయంగా ఉందా బస్సులు ఎక్కువగా వేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ప్రజలు ప్రయాణికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin