• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ఆర్టీసీ ఎలా పుట్టింది దాని చెరిత్ర ఏంటి…

Share Button

TS rtc
స్వాతంత్య్రం రాక ముందు తెలంగాణను పాలించిన అప్పటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కు ఇద్దరు కోడళ్లు ఒకరు జోహ్రా బేగం. ఈమె టర్కీ రాకుమారి. అయితే నిజాం కోడలు గా పెళ్లి చేసుకున్న పెళ్ళి కొడుకు ఈమేకు మనోవర్తీ అనగా మహర్ రూపంలో అప్పట్లో 2 లక్షల రూపాయలు నగదు ఇచ్చారు. ఇస్లాం మతం ఆచారం ప్రకారం ఆమె మెహెర్ ధనం 2 లక్షల రూపాయిల పై ఆమె కు పూర్తిగా హక్కు ఉంటుంది. ఆమె ఆ డబ్బులు దాన ధర్మం చేయవచ్చు ఎమైనా చేస్కోవచ్చు.

అయితే ఆమే ఏం చేయాలి ..ఏం చేసిన చిరకాలంగా ..పేదలకు ఉపయోగించే విధంగా ఉండాలి అని నిశ్చయించుకొన్నారు.. అంతలో ఒక రోజు రాకుమారి గారు నగరం లో పల్లకిలో వెళ్ళుచున్నారు.. చాలా మంది.. నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగీ నెత్తిన సామానులు పెట్టె పెట్టుకుని చిన్న పిల్లలు. ముసలి వారు. వికలాంగులు రోడ్డు వెంట నానా కష్టాలు పడతు వెళ్ళుచున్నారు వారి ని ఆపి ఎక్కడి నుండి వస్తునారు అని అడిగింది. వారు కొందరు నాందేడ్, మరి కొందరు ఔరంగాబాదు, మరి కొందరు వరంగల్ అని చెప్పారు ఇంకా కొందరు నడిచే వస్తున్నాము.అమ్మ.. అని ఏడ్చారు..అప్పుడు.. రాకుమారి.. అందరూ భగవంతుడు సృష్టించిన మనషులమే, నేను పల్లకిలో వెళ్ళటం ఎందుకు ప్రజలు కష్టాలు పడటం బాగలేదు అని తీవ్రంగా ఆలోచన చేసి వారి మామ గారు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలి ఖాన్ గారితో సంప్రదించి వారి అనుమతి సహకారాన్ని తీసుకుని తన తల్లి తండ్రులు బహుమతి రూపంలో ఇచ్చిన ఆభరణాలు వజ్రాలు,తన స్వంత డబ్బులు మహేర్ ఖర్చు చేసి 9 బస్సు డిపోలు ఎర్పాటు చేయించి, 50 బస్సులు కొని హైదరాబాద్, నాందేడ్, వరంగల్, ఫర్భనీ, గుల్బర్గా, రాయచూరు, వనపర్తి లలో బస్సు డిపో ల నుండి రైలు స్టేషన్ కు బస్సులు వెళ్ళాలి జనం తీసుకుని రావడానికి ఆ బస్సులు ఏర్పాటు చేసి దానికి N S R R T D= Nizam state Road and rail Transport Department అని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ బస్సుల సీరిస్ నెంబర్ APZ, TS,…z చివరి Z అక్షరం ఆమే పేరు Zohra Begum ఆమే పేరు మొదటి అక్షరం Z గా కొనసాగుతుంది.

అప్పుడు భారత దేశం అనే దేశం లేదు.. బ్రిటిష్ ఇండియా లో ఎక్కడ కూడా ప్రభుత్వం లో ప్రజా రవాణా లేదు.. కానీ కేవలం నిజాం రాష్ట్రంలోని ఉంది తర్వాత దీనికి NSRTD అని మార్చి రైల్వే నుండి వేరు చేసి నిజాం ప్రభుత్వం లో కలపారు.. ఇప్పుడు ఆలోచన చేయండి. నిజాం స్థాపించిన అనేక సంస్థలు నీమ్సు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి, నీలోఫర్ ఆసుపత్రి, MNJ cancer hospitals. Assembly,అన్ని సంస్థలు. ఆసుపత్రులు.ప్రభుత్వం లో ఉంటే … RTC మాత్రమే ప్రవైటు లో ఎందుకు ఉంది.. అంటే..1956.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి తెలంగాణ తొ కలిసిన ఆంధ్ర లో RTC లేదు ..ప్రభుత్వం రంగం లేదు.. ప్రవైటు బస్సులు మాత్రమే ఉన్నాయి.. కనుక మన RTC అలా ప్రభుత్వం నుంచి కార్పొరేషన్ అయింది.

ఇప్పుడు చెప్పండి RTC ప్రభుత్వం లో పెట్టింది నిజాం సర్కారు. కార్పోరేషన్ (సంస్థ) గా చేసింది అప్పటి ఆంధ్రప్రదేశ్ సర్కార్… . తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరువాలి, TS RTC ని ప్రభుత్వంలో విలీనం చేయాలి. RTC ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat