Prajavani in Prajabhavan పల్లెలు, పట్టణాల్లో ‘ప్రజావాణి’ క్యాంపులు..
ప్రతీ వారం రెండు రోజుల (మంగళ, శుక్రవారం) పాటు ప్రజా భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో prajavani in prajabhavan ప్రజలు వస్తుండడంతో రద్దీకి తగినట్లుగా టేబుళ్ళ సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూర ప్రాంతాల నుంచి కూడా గ్రీవెన్స్ ఇవ్వడానికి ప్రజలు వస్తుండడంతో వారికి తాగునీటి వసతితో పాటు కనీస సౌకర్యాలను కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పది రోజులుగా ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని ఇకపైన నిర్వహించాల్సిన విధానంపై సచివాలయంలో శుక్రవారం అధికారులతో జరిగిన రివ్యూ సందర్భంగా పై క్లారిటీ ఇచ్చారు. శిక్షణలో వున్న ఐఎఎస్ అధికారుల సేవలను ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమానికి వినియోగించుకోవాలని సూచించారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin