నేడు తెలంగాణకి సెంట్రల్‌ టీమ్‌..

0
love-agarwal

కరోనా నియంత్రణపై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనున్న కేంద్ర బృందం కట్టడి యత్నాలపై కీలక సూచనలు చేయనున్నది. మార్చి నెలలో కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పట్నించి రాష్ట్రాలకు…

తెలంగాణలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో మరోసారి సెంట్రల్ టీమ్ హైదరాబాద్‌కు రానుంది. దేశంలో కరోనా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటోంది. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తే.. మరికొన్ని సందర్భాల్లో తమ టీమ్‌లను రాష్ట్రాలకు పంపుతోంది. కరోనా నియంత్రణపై సమీక్షకు నాలుగోసారి సెంట్రల్ టీమ్‌ తెలంగాణకు రానుంది. Central team visits telangana

Central team visits telangana

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై అంచనా వేయనున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ తోపాటు కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పర్యటించనుంది.

కరోనా నియంత్రణపై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనున్న కేంద్ర బృందం కట్టడి యత్నాలపై కీలక సూచనలు చేయనున్నది. మార్చి నెలలో కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పట్నించి రాష్ట్రాలకు కీలక సూచనలు చేయడంలో చొరవ చూపుతున్న లవ్ అగర్వాల్.. తాజాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో మరింత పక్కా చర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాల అధికారులతో సమాలోచనలు జరపాలని తలపెట్టారు. అందుకే మూడు కీలక రాష్ట్రాలకు తానే స్వయంగా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను సందర్శించనున్నది కేంద్ర బృందం.

Central team visits telangana

ఇందు లో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు స్వచ్చందంగా లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి అందులో సికింద్రబాడ్ మరియు దానితో పటు కొన్ని ప్రాంతాలు పాటిస్తున్నాయి. ఈ నేపథ్యం లో కరోనా వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు అదేవిదంగా రాష్టానికి వచ్చి వెళ్లే వారు కూడా తగు జాగ్రత్తలు పాటించాలని భౌతిక దూరం పాటించాలని మాస్కులు పెట్టుకోవాలి సూచిస్తుంది.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *