Nagarkurnool District Collector పాత్రికేయులకు కృతజ్ఞతలు.
నాగర్ కర్నూలు జిల్లాలో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు అనుసంధానంగా వివరించిన పాత్రికేయులకు కృతజ్ఞతలు -జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్. nagarkurnool district collector
నాగర్ కర్నూల్ Nagarkurnool District Collector జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా జిల్లా యంత్రాంగానికి, ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎన్ఐసీ సమావేశం మందిరంలో శాసనసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా పాత్రికేయులతో ఆయన తేనీటి విందు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ…..
అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వాటి నుంచి నవంబర్ 30వ తేదీన పోలింగ్, ఈనెల 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల nagarkurnool district collector నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి పాత్రికేయుల సహాయ సహకారాలు భాగస్వామ్యం మరువలేనిదని కలెక్టర్ అన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు.
జిల్లాలోని నాగర్ కర్నూల్ అచ్చంపేట కొల్లాపూర్ మూడు నియోజకవర్గాల పరిధిలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగానికి ప్రజలకు సరైన సమాచారంతో తమ మాధ్యమాల ద్వారా అనుసంధానంగా వ్యవహరిస్తూ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.
జిల్లా అధికారుల నుండి ఎం సి ఎం సి మీడియా సెంటర్ నుండి ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు వివిధ ప్రాంతాల్లో జరిగే వివిధ అంశాల సమాచారాన్ని జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు చేరవేసిన ప్రతి పాత్రికేయునికి పేరుపేరునా ఆయన అభినందించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇదే స్ఫూర్తితో జిల్లా యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించేలా పనిచేయాలని ఆయన పాత్రికేయులను కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, ఏపీఆర్ఓ తిరుపతయ్య, ఎలక్షన్ సెక్షన్ సూపర్డెంట్ జాకీర్ అలీ, డిటి బాలరాజ్, రఘు, కలెక్టర్ పి ఎస్ ఖాజా మైనుద్దీన్, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ జిల్లా స్థాయి పాత్రికేయులు పాల్గొన్నారు.
Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin