పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలు

0
Achampet mla
Share

Achampet mla
అమ్రాబాద్, పదర, అచ్చంపేట్, బల్మూర్, లింగాల ఏజెన్సీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు విద్యాశాఖ కొత్త పంతుల్ల నియామకాలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగానే గురువారం మహబూబ్ నగర్ లో 52 మంది ఏజెన్సీ ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాజ్, మహబూబ్ నగర్ డీఈవో ఉషారాణి, నాగర్ కర్నూల్ డీఈవో, గోవిందరాజులు, అచంపేట్ ఏమ్ఈఓ రామారావు, కౌన్సెలింగ్ నిర్వహించారు.

Achampet mla

ఏజెన్సీ ప్రాంతమైన జిల్లా నాగర్ కర్నూల్ వ్యాప్తంగా 52మంది కొత్తగా ఏజెన్సీ పాఠశాలల్లో సేవలు అందించనున్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దార్వా ఏజెన్సీ పాఠశాలలకు ఎంపికైన 70 మంది ఏజెన్సీ అభ్యర్థుల ఏజెన్సీ ధ్రువపత్రాల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించి కమిటీ ధ్రువీకరించిన 51 మందికి నేడు ఉత్తర్వులను అప్పగించారు. ఒక్కరు నేడు నిర్వహించిన కౌన్సిలింగ్ హాజరు కాలేదు, మిగిలిన 18 మందికి ఏజెన్సీ ధ్రువపత్రాల ధ్రువీకరణ అనంతరం ఉత్తర్వులను అందజేస్తామని డిఇఓ తెలిపారు.
ఏజెన్సీ అమ్రాబాద్ పదర మండలాల ప్రాథమిక పాఠశాలల పరిధిలోని పాఠశాలల్లో 100% ఉపాధ్యాయులు చేరనున్నారు. ఇటీవల ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాకు స్కూల్‌ అసిస్టెంట్‌ 42, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు 159, ఆంగ్ల పాఠశాలలకు 24 మంది ఉపాధ్యాయులు, ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయుల నియామకంలో భాగంగా 51 మంది నాగర్ కర్నూలు జిల్లాకు మొత్తం 276 మంది నూతన ఉపాధ్యాయులు తెలంగాణ పబ్లిక్ కమిషన్ నిర్వహించిన 2017 సంవత్సరానికి సంబంధించిన టిఆర్టి ద్వారా భర్తీ అయ్యారని నూతన ఉపాధ్యాయులకు నిష్ట శిక్షణ ద్వారా సంపూర్ణంగా బోధన పద్ధతులను అందించి జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని డిఇవో గోవిందరాజులు వివరించారు.

ఏజెన్సీ అభ్యర్థుల అంతా సొంతం జిల్లా ఏజెన్సీ వాసులే కావడం తమ ప్రాంతం ఏజెన్సీ పాఠశాలల్లో వెంటనే విధుల్లో చేరి తమ ప్రాంత ఏజెన్సీ విద్యార్థుల విద్యా అభ్యున్నతికి కృషిచేయాలని నూతన ఏజెన్సీ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతూ డీఈవో గోవిందరాజులు సూచించారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *