దుబాయ్‌ లేదా శ్రీలంకలో ఐపీఎల్‌ 2020!

0
IPL-2020

దుబాయ్‌ లేదా శ్రీలంకలో ఐపీఎల్‌ 2020!

త్వరలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందన్న బీసీసీఐ అధికారి.

ఐపీఎల్‌ 2020 ఎడిషన్‌ విదేశాల్లో నిర్వహించడం ఖాయమే అని తెలుస్తోంది. వేదికగా దుబాయ్‌ లేదా శ్రీలంకను ఎంపిక చేసే అవకాశముంది. టీ20 ప్రపంచకప్‌పై ఏదో ఒక నిర్ణయం వెలువడితే ఈ విషయాన్ని ఐపీఎల్‌ పాలకవర్గం ప్రకటించనుందని బీసీసీఐ లోని ఓ అధికారి అంటున్నారు. IPL 2020 Latest News

IPL-2020

వీలైనంత వరకు భారత్‌లోనే లీగ్‌ను నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారట. కరోనా వైరస్‌ నియంత్రణలోకి రాకపోతే యూఏఈ లేదా శ్రీలంకకు టోర్నీని తరలించక తప్పదని ఆయన తెలిపారు. కాగా, వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, రిలయన్స్‌ వంటి మైదానాలున్న ముంబయి నగరానికే పరిమితం చేయడంపైనా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

‘మేమింకా వేదికను నిర్ణయించలేదు. విదేశాల్లో నిర్వహించే అవకాశమైతే ఉంది. ఎక్కువ జట్లు ఒకేసారి వచ్చి ఒకటి లేదా రెండు మైదానాల్లో ఆడే పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదు. ఆటగాళ్లు వచ్చాక సురక్షిత వాతావరణం సృష్టించాలి. అదీ అభిమానులు లేకుండా. దుబాయ్‌, శ్రీలంక ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాయి. వైరస్‌ పరిస్థితి, లాజిస్టిక్స్‌ అవసరాలను బట్టి వేదికను నిర్ణయించాలి’ అని ఓ అధికారి తెలిపారు.

IPL 2020 Latest News

చాలామంది టోర్నీ నిర్వహిస్తే చాలు ఎక్కడైనా ఫర్వాలేదని భావిస్తున్నట్లు సమాచారం. ఆటగాళ్ల భద్రత వంటి అంశాలను చూసుకొని, మరిన్ని చర్చల తర్వాత ఐపీఎల్‌ వేదికను నిర్ణయించనున్నారు. ఖాళీ మైదానాల్లో నిర్వహించే పక్షంలో విదేశాల్లో మాత్రం ఐపీఎల్‌ను నిర్వహిస్తే ఇబ్బంది ఉంటుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Follow us on Social Media : Facebook | Twitter | Youtube | Linkedin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *